ఇటీవలే టాప్ లెస్ పోజుతో దుమారం రేపింది కియరా అద్వానీ. సాధారణంగా ఆఫర్లు తగ్గిన వేళ హీరోయిన్లు అలాంటి పోజులతో రెచ్చిపోతూ ఉంటారు. అయితే కియరా మంచి ఊపులో ఉన్న సమయంలోనే టాప్ లెస్ చేసేసింది! ఒక ప్రముఖ ఫొటో గ్రాఫర్ క్యాలెండర్ కోసం కియరా ఆ పోజును ఇచ్చింది. కాసేపట్లోనే అది వైరల్ అయ్యింది.
ఆకు చాటు అందం గురించి కియరా ఫ్యాన్స్ ఊహల్లో తేలిపోయారు. సోషల్ మీడియాలో దీనిపై రకరకాల కామెంట్లు వినిపించాయి. ఆ ఆకు వెనుక ఏముందంటూ.. కొందరు గడుసరి అడ్మిన్లు తమ ఫేస్ బుక్ పేజీల్లో కామెంట్లు పెట్టారు. ఇక ట్రోలింగ్ కూడా ఒక రేంజ్ లో సాగింది. కియారా పోజును అవతార్ హీరోయిన్ పోజుతో పోలుస్తూ.. మీమ్స్ వచ్చాయి. మీమ్స్ మేకర్లు తమ క్రియేటివిటీని అంతా పండించేశారు.
ఇక తాజాగా ఒక ఇంటర్వ్యూలో కియరా అద్వానీ ఆ అంశం గురించి స్పందించి. టాప్ లెస్ పోజు గురించి మాట్లాడింది. ఆ పోజు గురించి మాట్లాడుకోవడానికి ఏం లేదన్నట్టుగా.. ఆ పోజు పై జరిగిన ట్రోలింగ్ గురించినే కియరా ఎక్కువగా స్పందించింది. ఆ ట్రోలింగ్ తనను కూడా నవ్వించిందని ఈ హీరోయిన్ చెప్పింది. అందుకు సంబంధించి మీమ్స్ తననూ ఎంటర్ టైన్ చేశాయని చెప్పింది. తన మీద వేసిన జోకులు ఫన్నీగా అనిపించాయని అంటోంది. మొత్తానికి తన మీదే జోకులేసినా నవ్వుకునేంత హుందాతనం కియరాకు ఉన్నట్టుంది.