ఇష్టపడి పెళ్లి చేసుకుంది. భర్తతో కొన్నాళ్లు కాపురం కూడా చేసింది. కుటుంబాన్ని మరింత బాగా చూసుకునేందుకు దుబాయ్ వెళ్లాడు భర్త. సరిగ్గా ఇక్కడే భార్య విచక్షణ మరిచింది. కామవాంఛలు పెరగడంతో మరిదితో ఎఫైర్ పెట్టుకుంది. విషయం బయటపడ్డంతో ఏకంగా భర్తనే చంపేసింది. తమిళనాడులోని కడలూరు జిల్లాలో జరిగిన ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.
ఓ పెళ్లి కోసం దుబాయ్ నుంచి సొంతూరుకు వచ్చాడు సదరు వ్యక్తి. సరిగ్గా అదే సమయంలో తన భార్య నిర్వాకం బయటపడింది. తమ అక్రమ సంబంధం బయటపడ్డంతో భార్య-మరిది కలిసి అతడ్ని హత్య చేశారు. ఇంటికి దగ్గర్లోనే అతడ్ని పూడ్చిపెట్టారు. అయితే విషయం బయటకు పొక్కకుండా ఉండేందుకు పోలీసుల్ని ఆశ్రయించారు.
భర్త కనిపించడం లేదని స్వయంగా పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది భార్య. ఆ వెంటనే మరిదితో కలిసి కేరళకు పారిపోయింది. భర్త కోసం వెదికిన పోలీసులకు, విచారణ సందర్భంగా అక్రమ సంబంధం వ్యవహారం తెలిసింది. దీంతో ఆ కోణంలో దర్యాప్తు చేయడంతో అసలు విషయం బయటపడింది. కేరళలో భార్యను, ఆమె మరిదిని పోలీసులు అరెస్ట్ చేశారు.
ఇక్కడ రెండు ట్విస్ట్ లు ఉన్నాయి. ఒకటి భర్తను చంపేసిన ఆరేళ్ల తర్వాత భార్య పట్టుబడింది. ఇక రెండోది, ఈమెకు ఇద్దరు పిల్లలున్నారు. అది కూడా తన భర్త వల్ల (మరిది వల్ల కాదు) కలిగిన సంతానమే. ఇప్పుడా పిల్లలు అనాథలుగా మారారు.