ఎవరైనా తాము ఎంచుకున్న రంగంలో పైకి రావాలంటే కాస్తా తెలివితేటలుండాలి. మరికొంత అదృష్టం తోడైతే ఇక తిరుగుండదు. కొందరికి కొన్నికొన్ని స్థలాలు అచ్చిరావెందుకో? అదే వ్యక్తి మరోచోట బాగా రాణిస్తుండటం మన కళ్లెదుటే కనిపిస్తోంటోంది.
ఈ ఉపోద్ఘాతమంతా హీరోయిన్ శ్రద్ధాదాస్ గురించే. అవునండోయ్ శ్రద్ధాదాస్ గుర్తు లేదా? ఒకప్పుడు టాలీవుడ్‌లో హీరోయిన్ పాత్రలు దక్కించుకునేందుకు నానాపాట్లు పడింది. ప్చ్…అయినప్పటికీ కాలం కలిసిరాలేదు. అయితే తనెనవరూ పట్టించుకోలేదని ఆ అమ్మడు ఊరికే ఉండలేదు. ప్రయత్నం ఎప్పుడు వృథా కాదనే సిద్ధాంతాన్ని బలంగా నమ్మే శ్రద్ధాదాస్ తన అదృష్టాన్ని పరీక్షకు పెట్టింది. టాలీవుడ్‌లో చిన్నిచిన్న పాత్రలతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది.
టాలీవుడ్ కాకపోతే కోలీవుడ్…అక్కడా అవకాశాలు దొరక్కపోతే బాలీవుడ్ అనుకుందామె. టాలీవుడ్ కాదన్నా…బాలీవుడ్ రా రమ్మని శ్రద్ధాదాస్‌ని ఆహ్వానించింది. దీంతో బాలీవుడ్‌లో అడుగు పెట్టి ఒక్కో మెట్టు ఎక్కుతూ అందరి దృష్టిని ఆకర్షించింది. ఈ వేళ బాలీవుడ్‌లో సినిమాలతో పాటు వెబ్ సిరీస్‌లు కూడా చేస్తూ చాలా బిజీ అయ్యిందా భామ.
తన గ్లామర్ ఏంటో కుర్రకారుకు రుచి చూపించాలని ఆమె అనుకున్నారు. అనుకోవడమే ఆలస్యం…తానెంత గ్లామరస్ హీరోయిన్నో తెలిసేలా హాట్ హాట్ ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ప్రస్తుతం ఈ ఫొటోలు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి.
ఈ భామ తనకు ఎంతో ఇష్టమైన ప్రదేశాలలో మరో ప్రదేశాన్ని కనుగొన్నానని తెలుపుతూ గోవాలో స్విమ్ షూట్‌లో ఉన్న ఫొటోలను ట్విట్టర్‌లో పోస్ట్ చేసింది. ఈ ఫొటోలను నెటిజన్లు ఆకలిగొన్నట్టు షేర్ చేస్తుండడం గమనార్హం.