రెడ్ సినిమా రీమేక్ కాదంటున్న దర్శకుడు

తమిళ్ లో సూపర్ హిట్టయిన తడమ్ సినిమాకు రీమేక్ గా వస్తోంది రెడ్. కానీ దర్శకుడు కిషోర్ తిరుమల మాత్రం దీన్ని రీమేక్ అంటే ఒప్పుకోడు. రెడ్ సినిమాను ఓ ఫ్రెష్ మూవీగా చెప్పుకొస్తున్నాడు.…

తమిళ్ లో సూపర్ హిట్టయిన తడమ్ సినిమాకు రీమేక్ గా వస్తోంది రెడ్. కానీ దర్శకుడు కిషోర్ తిరుమల మాత్రం దీన్ని రీమేక్ అంటే ఒప్పుకోడు. రెడ్ సినిమాను ఓ ఫ్రెష్ మూవీగా చెప్పుకొస్తున్నాడు.

“స్టోరీ ఐడియా మాత్రం తీసుకున్నాం. ఓ ఫ్రెష్ స్క్రిప్ట్ పై ఎలా వర్క్ చేస్తామో అలానే చేశాం. ఓ ఫ్రెష్ ఐడియా వచ్చినప్పుడు దానిపై ఎంత హార్డ్ వర్క్ చేస్తానో, రెడ్ సినిమాకు కూడా అలానే వర్క్ చేశాను. కాబట్టి రెడ్ సినిమా రీమేక్ అనిపించదు. ఓ ఫ్రెష్ మూవీ. కేవలం లైన్ మాత్రమే తీసుకున్నాం. మేకింగ్, స్క్రీన్ ప్లే, డైలాగ్స్ అన్నీ కొత్తగా ఉంటాయి.”

ఇస్మార్ట్ శంకర్ తో రామ్ కు ఓ కొత్త ఇమేజ్ వచ్చింది. అయితే ఆ ఇమేజ్ ను దృష్టిలో పెట్టుకొని రెడ్ సినిమాలో రామ్ క్యారెక్టర్ ను డిజైన్ చేయలేదంటున్నాడు కిషోర్ తిరుమల. నిజానికి సినిమాలో రామ్ లుక్ కూడా తను డిజైన్ చేసింది కాదని, రామ్ సొంతంగా ఆ లుక్ ట్రై చేశాడని చెప్పుకొచ్చాడు.

“రెడ్ లో లుక్ రామ్ డిజైన్ చేసుకున్నదే. ట్రావెలింగ్ లో భాగంగా ఓసారి షార్ట్ హెయిర్, గడ్డంతో కనిపించాడు రామ్. ఆ లుక్ నాకు బాగా నచ్చింది. దాన్నే కొనసాగించాం. ఇక డ్యూయల్ రోల్ అన్నప్పుడు ఓ పాత్రను సాఫ్ట్ గా చూపిస్తుంటారు చాలామంది. నాకు అలాంటి సాఫ్ట్ లుక్ వద్దనుకున్నాను. పైగా కథకు అక్కర్లేదు. అందుకే రెండు పాత్రలు రఫ్ గానే కనిపిస్తాయి.”

ఎక్కువసార్లు రామ్ తోనే వర్క్ చేయడంపై స్పందించిన ఈ దర్శకుడు.. రామ్ తో, రవికిషోర్ తో జర్నీ బాగుంటుందని చెబుతున్నాడు. శర్వానంద్ తో త్వరలోనే చేయబోతున్న ఆడాళ్లు మీకు జోహార్లు సినిమాలో వినోదం ఎంత ఎక్కువగా ఉంటుందో, ఎమోషన్ కూడా అంతే ఎక్కువగా ఉంటుందని చెబుతున్నాడు.