రొటీన్ కు ‘చెక్’ చెప్పిన నితిన్

కొందరుంటారు. వాళ్లకి రొటీన్ సినిమాలు తీయడం అంటే కిట్టదు. అన్ని సినిమాలు ఒకేలా వుండవు అనే థీమ్ కు అంటిపెట్టుకుని వుంటారు. అలాంటి వాళ్లలో దర్శకుడు చంద్రశేఖర్ యేలేటి ముందు వరుసలో వుంటారు.  Advertisement…

కొందరుంటారు. వాళ్లకి రొటీన్ సినిమాలు తీయడం అంటే కిట్టదు. అన్ని సినిమాలు ఒకేలా వుండవు అనే థీమ్ కు అంటిపెట్టుకుని వుంటారు. అలాంటి వాళ్లలో దర్శకుడు చంద్రశేఖర్ యేలేటి ముందు వరుసలో వుంటారు. 

మనమంతా లాంటి ఫీల్ గుడ్, ఎమోషనల్ మూవీ తరువాత ఆయన చేస్తున్న సినిమా 'చెక్'. చదరంగాన్ని, జీవితాన్ని ముడిపెడుతూ, చెస్ లో నైపుణ్యం వున్న ఓ యువకుడి జీవితాన్ని నెరేట్ చేస్తూ అందిస్తున్న సినిమా ఇది.

న్యూ ఇయర్ సందర్భంగా ఈ సినిమా నుంచి చిన్న టీజర్ విడియో వదిలారు. మరణ శిక్ష పడిన ఖైదీ, అతను నిర్దోషి అని నమ్మే అమ్మాయి. 

అతను దోషి ఫిక్స్ అయిపోయిన పోలీస్ ఆఫీసర్, అన్నింటికి మించి అతనిలోని చెస్ క్రీడా టాలెంట్ ను గుర్తించిన వ్యక్తి ఈ పాత్రలతో కథ నడపబోతున్నట్లు టీజర్ లో చెప్పేసారు.

తనకు కథే ముఖ్యం అనే పద్దతిలోనే డైరక్టర్ యేలేటి ఈసారి కూడా ముందుకు వెళ్లినట్లు కనిపిస్తోంది. భవ్య క్రియేషన్స్ పతాకంపై ఆనంద్ ప్రసాద్ నిర్మించిన ఈ సినిమాకు అన్నేరవి నిర్మాణ నిర్వహణ. కళ్యాణ్ మాలిక్ సంగీత దర్శకుడు.