సమర్పకుడిగా ‘కొరటాల’

దర్శకుడు కొరటాల సినిమా సమర్పకుడిగా మారుతున్నారు. అంటే ఆ ప్రాజెక్టులో అంతో ఇంతో భాగస్వామిగా. ఆయనకు అంతలా నచ్చేసింది ఓ కథ.  Advertisement విషయం ఏమిటంటే గతంలో జవాన్ సినిమాను నిర్మించిన కృష్ణ మరో…

దర్శకుడు కొరటాల సినిమా సమర్పకుడిగా మారుతున్నారు. అంటే ఆ ప్రాజెక్టులో అంతో ఇంతో భాగస్వామిగా. ఆయనకు అంతలా నచ్చేసింది ఓ కథ. 

విషయం ఏమిటంటే గతంలో జవాన్ సినిమాను నిర్మించిన కృష్ణ మరో సినిమా నిర్మాణానికి సన్నాహాలు చేసుకుంటున్నారు. అందుకోసం ఒక మాంచి కథను తయారుచేసుకున్నారు. ఒపీనియన్ కోసం కొరటాలకు వినిపించారు. ఆయనకు భయంకరంగా నచ్చేసింది. 

గోపాల్ అనే కొత్త దర్శకుడు తయారుచేసిన కథ ఇది. దాంతో అదే డైరక్టర్ చేత, సత్యదేవ్ హీరోగా సినిమాను ప్లాన్ చేసేసారు. ఈ సినిమాకు సమర్పకుడు కొరటాల. 

నిర్మాత 'జవాన్' కృష్ణ. దర్శకుడు గోపాల్ అన్న మాట. ఎప్పటి నుంచో కథాబలం వున్న మంచి చిన్న సినిమాలు నిర్మించాలన్న ఆలోచనతో వున్నారు. ఆ ఆలోచన ఇప్పుడు కార్యరూపం దాల్చుతోందన్నమాట.

ప్రస్తుతం ఆచార్య సినిమా వ్యవహారాల్లో బిజీగా వున్నారు కొరటాల. దాని తరువాత ఎన్టీఆర్ సినిమా మీదకు వెళ్తారు.