కోరిక విలువ…60 కోట్లు

ఎలాంటి వారికైనా ఏదో ఒక కొరిక మనసు ను దొలిచేస్తూ వుంటుంది. కోరిక సాధ్యాసాధ్యాలతో పాటు, ఆనుపానులు కూడా చూసి కొందరు పక్కన పెడతారు. మరి కొందరు ఎవ్వరేమనుకుంటేనేం తన కోరిక తనది అన్నట్లు…

ఎలాంటి వారికైనా ఏదో ఒక కొరిక మనసు ను దొలిచేస్తూ వుంటుంది. కోరిక సాధ్యాసాధ్యాలతో పాటు, ఆనుపానులు కూడా చూసి కొందరు పక్కన పెడతారు. మరి కొందరు ఎవ్వరేమనుకుంటేనేం తన కోరిక తనది అన్నట్లు ముందుకు సాగిపోతారు. 

చెన్నై శరవణ స్టోర్స్ యజమానుల్లో ఒకరైన అరుళ్ శరవణన్ ఉదంతం ఇలాంటిదే. దశాబ్దాల కాలంగా సాగుతున్న కుటుంబ వ్యాపారం సాధించిన పెట్టిన కోట్లు పెరుగుతూనే వున్నాయి. మొత్తం మీద సుమారు 10 వేల మంది సిబ్బంది అరుళ్ స్టోర్స్ ల్లో పని చేస్తున్నారు. వ్యాపారంతో పాటే అరుల్ కోరిక కూడా పెరుగుతూనే వుంది. కెమెరా ముందుకు రావాలన్నదే ఆ కోరిక.

అందుకే తన స్టోర్స్ పబ్లిసిటీ మెటీరియల్ అంతా అరుల్ చుట్టూనే తిరుగుతుంది. ఆ వీడియోల్లో అతగాడే, ఆ హోర్టింగ్ ల మీదా అతగాడే. మోడల్ అతనే..డ్యాన్స్ లు అతనివే. కానీ కోరిక అక్కడితో తీరిపోలేదు. 

యాభై రెండేళ్ల వయస్సు వచ్చినా సినిమా లో హీరోగా కనిపించాలన్న కోరిక తగ్గలేదు. తీరలేదు. అయితే ఈ కోరికను సాదా సీదాగా తీర్చుకోవాలని అనుకోలేదు. పక్కా పెర్ ఫెక్ట్ సినిమా ఇవ్వాలనుకున్నాడు. అందుకే ముందుగా ఫిల్మ్ ఇన్ స్టిట్యూట్ లో చేరి శిక్షణ పొందాడు.

అలాంటి ఇలాంటి సినిమా తీయాలనుకోలేదు. 60 కోట్ల రూపాయల ఖర్చుతో భారీ సినిమా చేసేసారు. ది లెజెండ్ అంటూ చేసిన ఈ సినిమాలో ఊర్వశి రౌతాలా, లక్ష్మీరాయ్ నటించారు. హారిష్ జయరాజ్ సంగీతం. రాజు సుందరం నృత్య దర్శకత్వం, గతంలో భారీ సినిమాలు తీసిన జంట దర్శకులు జెడి..జెర్రీ లు పనిచేసారు.

అలా అని ఏదో తమిళంలో విడుదల చేసి ఊరుకోవడం లేదు. హిందీ, కన్నడ, మలయాళ, తెలుగు భాషల్లో విడుదల చేస్తారు. మళ్లీ అలా అని నామ మాత్రంగా విడుదల చేయడం లేదు. దుబాయ్, ముంబాయి, బెంగళూరు, హైదరాబాద్ ల్లో భారీగా ప్రమోషన్ నిర్వహించారు.

ఇద్దరు కుమార్తెలు, ఒక కొడుకు వున్న అరుళ్ ఇప్పటికే ఓ కుమార్తెకు పెళ్లి చేసారు కూడా.