Advertisement

Advertisement


Home > Movies - Movie News

కొత్త నెత్తురు కోసం ప్రశాంత్ వర్మ

కొత్త నెత్తురు కోసం ప్రశాంత్ వర్మ

టాలీవుడ్ లోకి ఎప్పటికప్పుడు కొత్త నెత్తురు వస్తూనే వుంటుంది. కొత్త కొత్త ఆలోచనలు చేస్తూనే వుంటారు. అయితే ఇప్పుడు కాలం మరింత మారింది. ఇంకా..ఇంకా..కొత్త ఆలోచనలు కావాలి అంటూ తపిస్తోంది టాలీవుడ్. అందుకే దర్శకుడు ప్రశాంత్ వర్మ కొత్త ఆలోచన చేసారు. 

సినిమా రంగంలోకి వివిధ క్రియేటివ్ టాపిక్స్ అన్నింటినీ కవర్ చేస్తూ ఓ వంద మంది కొత్త కుర్రాళ్లతో ఓ ప్లాట్ ఫార్మ్ తయారు చేయాలని అనుకుంటున్నారు. ఇప్పుడు అదే అనౌన్స్ చేసారు.

ఈ వివిధ క్రాఫ్ట్ ల కోసం ఈ వంద మంది కొత్తమందిని తీసుకుని ఓ దగ్గర చేర్చి కొత్త కొత్త ఐడియాలతో కొత్త ప్రొడెక్ట్ లకు శ్రీకారం చుట్టాలన్నది ప్రశాంత్ వర్మ ఐడియా. ఇప్పుడు కంటెంట్ కోసం విపరీతీమైన డిమాండ్ వుంది. ఆన్ లైన్ ప్లాట్ ఫార్మ్ లు, సినిమా రంగం ఇలా అంతా ఎదురుచూస్తున్నారు. ప్రశాంత్ వర్మ లాంటి వారికి వాటితో మంచి యాక్సెస్ వుంటుంది. కొత్తవారిని తీసుకుని, కొత్త ఆలోచనలను స్వీకరిస్తూ, వాటిని సాన పడుతూ కంటెంట్ క్రియేట్ చేయడం అన్నది అటు వారికీ బాగుంటుంది, ఇటు ఈయనకూ బాగుంటుంది.

గ్రేట్ ఆంధ్ర కు ఇంటర్వూ ఇస్తూ ఈ విషయాలు అన్నీ వెల్లడించారు ప్రశాంత్ వర్మ. హనుమాన్ సినిమా విడుదల డేట్ అనౌన్స్ మెంట్ కు అస్సలు తొందర పడడం లేదని, పూర్తిగా క్వాలిటీతో సినిమా రెడీ అయిందని తెలిసిన తరువాతే విడుదల డేట్ అనౌన్స్ చేస్తామని ప్రశాంత్ వర్మ చెప్పారు. 

సినిమాలో 1600 సిజి షాట్ లు వుంటాయని, ఇప్పటికి 800 వరకు పూర్తయ్యాయని అన్నారు. తొందరపడి, అందరూ అడుగుతున్నారని, ఏదో ఒక డేట్ ఫిక్స్ చేసి, విడుదల చేస్తే, రేపు ప్రొడెక్ట్ బాగా లేకపోతే మాటపడేది తామే అని, అందుకే అస్సలు రిస్క్ తీసుకోవడం లేదని, నిర్మాత కూడా క్వాలిటీ ప్రొడెక్ట్ అన్న దాని మీదే ఫిక్స్ అయి వున్నారని ప్రశాంత్ వర్మ అన్నారు.

‘హనుమంతుడి సూపర్ పవర్స్ ఓ కామన్ మాన్ కు వస్తే’ ఎలా వుంటుంది అన్నది సినిమా కోర్ పాయింట్ అని, సినిమాలో చాలా సార్లు హనుమాన్ గురించి వుంటుంది, మిగిలినదంతా సోషియో మైథలాజికల్ టచ్ తో వుంటుంది అన్నారు. ఈ క్యారెక్టర్ కు తేజు సజ్జా పెర్ ఫెక్ట్ యాప్ట్ అని, ఓ కామన్ మాన్ కు సూపర్ పవర్స్ వస్తే వేరు..ఆల్రెడీ సూపర్ హీరో అనుకునే పర్సన్ కు సూపర్ పవర్స్ వస్తే వేరు అని వివరించారు.

సినిమాలో కొన్ని సీన్లలో ప్రేక్షకులు కాళ్లకు జోళ్లు తీసేసి చూడాలనేంత ఇంటెన్సిటీ వుంటుందని ప్రశాంత్ వర్మ వివరించారు. ఈ సినిమా తరువాత డివివి కళ్యాణ్ తో అధీర మూవీ చేయబోతున్నా అని, అది ఇంద్రుడి సూపర్ పవర్స్ ఓ కుర్రాడికి వస్తే అన్న కాన్సెప్ట్ తో వుంటుందని వివరించారు. 

ఇలాంటి సూపర్ పవర్ క్యారెక్టర్లు మొత్తం ఎనిమిది తయారు చేసానని, మొదటి రెండు మాత్రమే తాను సినిమాలు గా రూపొందిస్తా అని, మిగిలినవి అన్నీ తన సహచరులకు అప్పగిస్తా అని ప్రశాంత్ వర్మ వివరించారు.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?