కోటిన్నరకు తగ్గేదే లే!

సరైన అందం,చందం, క్రేజ్ వుండాలే కానీ హీరోయిన్ల ఆదాయానికి కొదవలేదు. హీరోయిన్ పాత్రలు, దుకాణాల ఓపెనింగ్ లు, అడ్వర్టైజ్ మెంట్లు, ఇన్ స్టాలో పోస్టులు ఇలా ప్రతీదీ ఆదాయవనరే. అన్నింటికన్నా మించి ఐటమ్ సాంగ్…

సరైన అందం,చందం, క్రేజ్ వుండాలే కానీ హీరోయిన్ల ఆదాయానికి కొదవలేదు. హీరోయిన్ పాత్రలు, దుకాణాల ఓపెనింగ్ లు, అడ్వర్టైజ్ మెంట్లు, ఇన్ స్టాలో పోస్టులు ఇలా ప్రతీదీ ఆదాయవనరే. అన్నింటికన్నా మించి ఐటమ్ సాంగ్ లు చెప్పకనక్కరలేదు. రెండు నుంచి మూడు రోజులు కాస్త కష్టపడితే చాలు కోట్లు వచ్చి అక్కౌంట్లో వాలతాయి.

కాస్త క్రేజ్ వున్న హీరోయిన్లను ఐటమ్ సాంగ్ కు అడిగితే రేట్లు ఓ రేంజ్ లో చెబుతున్నారు. తమన్నా కోటి రూపాయలు అయిటమ్ సాంగ్ కు తీసుకుంటే, ఆ మధ్య సమంత కోటిన్నరకు పైగా తీసుకుంది పుష్ప సినిమాకు. లేటెస్ట్ గా పొడవు కాళ్ల పాప పూజా హెగ్డే ఓ ఐటమ్ సాంగ్ కు ఓకె చెప్పింది.

ఎఫ్ 3 సినిమాలో వున్న మసాలాలు చాలవని, పూజా హెగ్డేతో ఐటమ్ సాంగ్ ప్లాన్ చేసారు. కేవలం మొహమాటం మీదే కాదు, కొటిన్నర రెమ్యూనిరేషన్ ఇస్తేనే చేస్తానని తెగేసి చెప్పినట్లు బోగట్టా.  మా దగ్గర బేరాలు లేవమ్మా అని కోటిన్నర మొహమాటం లేకుండా చార్జ్ చేసి ఐటమ్ సాంగ్ కు ఓకె చెప్పిందట.

ఇలా అయిటమ్ సాంగ్ లు చేస్తే క్రేజ్ తగ్గిపోతుందని, ఆమెను హీరోయిన్ గా తీసుకున్న, తీసుకుంటున్న ప్రాజెక్టుల జనాలు ప్రస్తావిస్తే, ఈ ఒక్కసారికే, అది దిల్ రాజు మొహమాటం అంటోందట. కోటిన్నర తీసుకున్నాక ఇంకా మొహమాటం ఏమిటి?