డైరక్టర్ క్రిష్ హీరో వైష్ణవ్ తేజ్ తో జంగిల్ బుక్ లాంటి ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్. ఈ సినిమా చకచకా నలభై రోజుల్లో షూటింగ్ వర్క్ ఫినిష్ చేయాలన్నది క్రిష్ ప్లాన్. మరో పక్కన ఈ సినిమా మ్యూజిక్ సిటింగ్ లు కూడా ప్రారంభించేస్తున్నారు.
కీరవాణి సంగీత దర్శకుడు. చంద్రబోస్ సింగిల్ కార్డ్ రైటర్. ఆ మధ్యన క్రిష్-కీరవాణి కలిసి పవన్ కళ్యాణ్ సినిమాకు పని చేస్తారని వార్తలు వున్నాయి. ఆ సినిమా ఇంకా స్టార్ట్ కాలేదు కానీ, అదే కాంబినేషన్ లో ఈ సినిమా వర్క్ మాత్రం ప్రారంభమైపోయింది.
ఆర్ఆర్ఆర్ వర్క్ అలా వుండగానే కీరవాణి సంగీత దర్శకుడిగా ఫుల్ బిజీ అవుతున్నారు. క్రిష్ తో రెండు సినిమాలు వుండగా ప్రభాస్ సినిమా కూడా ఒకటి చేయబోతున్నారని గ్యాసిప్ లు వున్నాయి. తెలుగులో సరైన సంగీత దర్శకుల కొరత గట్టిగావుంది. అందుకే సీనియర్లను వెదుక్కుంటూ సినిమాలు వస్తున్నాయి.