వైష్ణవ్ తేజ్, రకుల్ హీరోహీరోయిన్లుగా లాక్ డౌన్ టైమ్ లో ఓ సినిమా కంప్లీట్ చేశాడు క్రిష్. అందరికీ ఇంతవరకే తెలుసు. ఆ సినిమా కథేంటి.. అందులో హీరోహీరోయిన్ల పాత్రలేంటి.. అసలు ఆ సినిమా టైటిల్ ఏంటి లాంటి విషయాలేవీ బయటకు రాలేదు.
ఎట్టకేలకు తన లాక్ డౌన్ మూవీపై పెదవి విప్పాడు దర్శకుడు క్రిష్. లాక్ డౌన్ టైమ్ లో చదివిన ఓ పుస్తకం తనను బాగా కదిలించిందని, ఎంతలా అంటే వెంటనే సినిమాగా తీసేయాలని అనిపించిందని చెప్పుకొచ్చాడు. ఆ పుస్తకం పేరు కొండ పొలం.
“నేను పవన్ కల్యాణ్ సినిమాపైన సీరియస్ గా పనిచేస్తున్నాను. ఆ రోజు రాత్రి సప్తభూమి అనే పుస్తకం చదివాను. ఆ తర్వాత 2-3 రోజులకు కొండపొలం అనే పుస్తకం చదివాను. రాత్రి 4 గంటల వరకు చదివాను.
ఆ తర్వాత నాకు నిద్ర పట్టలేదు. ఆ మరుసటి రోజు కూడా నిద్ర పట్టలేదు. వెంటనే నా పార్టనర్ కు చెప్పి రైట్స్ తీసుకోమని చెప్పాను. 2-3 ఏళ్ల తర్వాత చేద్దాం అనేది నా ప్లాన్. కానీ ఆ తర్వాత కూడా మరో 2 రోజులు నిద్ర పట్టలేదు. ఆ పుస్తకమే మైండ్ లో రన్ అవుతోంది.”
దీంతో ఆ పుస్తకాన్ని సినిమాగా వెంటనే తీయాల్సిందేనని ఫిక్స్ అయిపోయాడు క్రిష్. మధ్యలో ఓ సినిమా చేసేందుకు పవన్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో.. వెంటనే రకుల్-వైష్ణవ్ తేజ్ ను సంప్రదించడం.. ఆ వెంటనే 2 వారాల్లోనే షూట్ స్టార్ట్ చేయడం చకచకా జరిగిపోయాయి.
ఇలా కొండపొలం అనే పుస్తకం ఆధారంగా సినిమా తీసిన విషయాన్ని బయటపెట్టాడు క్రిష్. ఈ సినిమాలో రకుల్, రాయలసీమ అమ్మాయిగా కనిపించబోతోంది. ఆమె పేరు ఓబులమ్మ. తన సినిమాకు కూడా కొండ పొలం అనే టైటిల్ పెట్టాలని అనుకుంటున్నాడు క్రిష్.