వయసు మీద పడిన తరువాత ప్రేమ, పెళ్లి అంటే కాస్త ఫన్ వుంటుంది. అదే మరి కాస్త ముందుకు వెళ్లి, ఇంట్లో తీరని కోర్కెలు అక్కడ తీర్చుకోవాలని ట్రయ్ చేస్తే, అది మరింత నాటు ఫన్ గా మారుతుంది.
దర్శకుడు శ్రీవాస్ కథ అందిస్తూ తన పర్యవేక్షణలో సత్తిబాబు డైరక్షన్ లో నిర్మిస్తున్నక్రేజీ అంకుల్స్ సినిమా వ్యవహారం ఇదే.
ఈ సినిమా ట్రయిలర్ విడుదలయింది. పాపులర్ యాంకర్ శ్రీముఖి చుట్టూ తిరిగే కథ ఇది. క్రేజీ అంకుల్స్ గా సింగర్ మనో, సీనియర్ యాక్టర్ రాజా రవీందర్ నటిస్తున్నారు. తనికెళ్ల భరణి, హేమ తదితరులు కూడావున్నారు.
ట్రయిలర్ మొహమాటం పడకుండా వదిలారు. ' మా వైఫ్ లు, తాజ్ మహల్ ఒక్కటే చూడ్డానికి తప్ప ఎక్కటానికి పనికిరావు' అనే డైలాగ్ తోనే సినిమా వ్యవహారం ఎలా వుండబోతోందో చెప్పేసారు. అంతే కాదు చాలా మంది సెలబ్రెటీలు ఇలాంటి సైడ్ ఇన్ కమ్ తోనే కార్లు ఫ్లాట్ లు కొంటారు అంటూ డైలాగులు కూడా వదిలారు.
ఇక్కడైతే కుదరదు అంటే దుబాయ్ కు వస్తారా? అని, గంటకు ఒకరి వంతున టైమ్ స్లాట్ ఇవ్వడం ఇవన్నీ తరచు వెబ్ సైట్ లలో కనిపించే గ్యాసిప్ లు అన్నీ తెచ్చి గుదిగుచ్చినట్లు కనిపిస్తోంది. చివరగా క్రేజీ అంకుల్స్ ముగ్గురు బకరాలు అయ్యేటట్లు కనిపిస్తోంది. రఘు కుంచె నేపథ్య సంగీతం బాగుంది.