మంచు ఫ్యామిలీ హీరో మనోజ్. టాలెంట్ వున్నా సరైన సినిమా పడలేదు. ప్లానింగ్ మిస్ ఫైర్ అయి వుండొచ్చు. దీనికి తోడు మనోజ్ కాస్త ఓవర్ వెయిట్ కూడా. ఇప్పుడు మనోజ్ పూర్తిగా తన దృష్టి కెరీర్ మీద పెట్టాడు. అందుకే ముందుగా తన ఫిజిక్ ను సెట్ చేసుకోవాలని డిసైడ్ అయ్యాడు.
అందుకే అర్జంట్ గా వర్కవుట్ లు చేసి 15 కిలోల బరువు తగ్గాడు. తగ్గడమే కాదు తన లుక్ ను స్మార్ట్ గా మార్చుకున్నాడు. ఆయుర్వేదిక్ డైట్, కఠినమైన వ్యాయామం చేసి మనోజ్ స్లిమ్‌గా మారాడు. ఆ
ఫొటోలను సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేశాడు. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. మనోజ్ హార్డ్ వర్క్ చూసి ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు. ప్రస్తుతం మళ్లీ కెరీర్‌పై దృష్టి సారించిన మనోజ్ మరో రెండు సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.
ఒకటి తెలుగు దర్శకుడితో తెలుగు / తమిళ చిత్రం, రెండోది తమిళ దర్శకుడి నుండి తెలుగు, తమిళ ద్విభాష చిత్రం. ఈ రెండు చిత్రాలను 2021లో విడుదలచేయడానికి ప్లాన్ చేస్తున్నారు మంచు మనోజ్. వీటితో పాటు స్పోర్ట్స్ అండ్ ఎంటర్టైన్మెంట్ సిటీ కూడా డెవలప్ చేస్తున్నారు. త్వరలోనే దాని గురించి వివరించనున్నాడు.