ఇక ఈ టాపిక్స్ వదిలేయండి కృష్ణంరాజు గారూ..!

ప్రభాస్ కు సంబంధించి కృష్ణంరాజు మాట్లాడాల్సి వస్తే, స్టాక్ లో ఎప్పుడూ 2-3 అంశాలు రెడీగా ఉంటాయి. వాటిలో ఒకటి పెళ్లి. ఇంకోటి భక్త కన్నప్ప రీమేక్, మరోటి మనవూరి పాండవులు, దర్శకత్వం.. ఇలా…

ప్రభాస్ కు సంబంధించి కృష్ణంరాజు మాట్లాడాల్సి వస్తే, స్టాక్ లో ఎప్పుడూ 2-3 అంశాలు రెడీగా ఉంటాయి. వాటిలో ఒకటి పెళ్లి. ఇంకోటి భక్త కన్నప్ప రీమేక్, మరోటి మనవూరి పాండవులు, దర్శకత్వం.. ఇలా కొన్ని టాపిక్స్ ఎప్పుడూ ఉంటూనే ఉంటాయి. అయితే అవి ఎప్పటికీ కార్యరూపం దాల్చవు. 

రాబోయే రోజుల్లో అది మరింత కష్టమనే విషయం కూడా మనకు అర్థమౌతూనే ఉంది. సో.. కృష్ణంరాజు ఇకపై ఈ టాపిక్స్ వదిలేస్తే బెటరేమో.

ప్రభాస్ పిల్లల్ని ఎత్తుకొని ఆడించాలని ఉంది..!

ప్రభాస్ పెళ్లిపై కృష్ణంరాజు గతంలో ఎన్నోసార్లు మాట్లాడారు. “ఇదిగో ఈ ఏడాదిలోనే పెళ్లి” అంటూ ప్రకటనలు చేసిన సందర్భాలూ ఉన్నాయి. అయితే ప్రభాస్ పెళ్లి కృష్ణంరాజు చేతిలో లేదనే విషయం ఈమధ్య కాలంలో అందరికీ అర్థమైపోయింది. ఇలాంటి టైమ్ లో మరోసారి మీడియా ముందుకొచ్చిన కృష్ణంరాజు.. ఈసారి కూడా ప్రభాస్ పెళ్లిపై రియాక్ట్ అయ్యారు.

ప్రభాస్ తొందరగా పెళ్లి చేసుకొని ఓ బిడ్డను కంటే, ఎత్తుకొని ఆడించాలని ఉందంటూ కృష్ణంరాజు తాజాగా స్టేట్ మెంట్ ఇచ్చారు. ఈ ఒక్క ప్రకటనతోనే అర్థమౌతోంది, ప్రభాస్ పెళ్లి కృష్ణంరాజు చేతిలో లేదనే విషయం. అటు ప్రభాస్ కు కూడా పెళ్లిపై మూడ్ ఉన్నట్టు కనిపించడం లేదు. రాధేశ్యామ్ ను రిలీజ్ చేసిన ఈ హీరో, వరుసపెట్టి సినిమాలు చేస్తూ బిజీగా గడిపేస్తున్నాడు.

రీమేక్స్ ఇప్పట్లో సాధ్యమేనా?

ప్రభాస్ కు సంబంధించి కృష్ణంరాజు రెగ్యులర్ గా మాట్లాడే అంశాల్లో ఒకటి భక్త కన్నప్ప రీమేక్. ఎప్పటికైనా గోపీకృష్ణ మూవీస్ బ్యానర్ పై భక్తకన్నప్ప సినిమాను ప్రభాస్ హీరోగా రీమేక్ చేస్తానంటూ ఇప్పటికే ఎన్నోసార్లు ప్రకటించుకున్నారు కృష్ణంరాజు. తాజాగా కూడా మరోసారి ఆ ప్రకటన చేశారు. ఈసారి దీనికి అదనంగా మనవూరి పాండవులు రీమేక్ కూడా ప్రస్తావించారు.

కృష్ణంరాజుకు రీమేక్ కోరికలు ఉండడంలో తప్పులేదు. తన వారసుడు ప్రభాస్, తన సినిమాల్ని రీమేక్ చేయాలని ఆయన కోరుకోవడం సహజం. కానీ ప్రభాస్ రేంజ్, మార్కెట్ ఇప్పుడు పూర్తిగా మారిపోయింది. పైగా రీమేక్స్ చేయాలనే ఆలోచనలు తనకు పెద్దగా లేవని రీసెంట్ ఇంటర్వ్యూల్లో కూడా ప్రకటించేశాడు ప్రభాస్.

సో.. ఇకపై ప్రభాస్ ఎప్పుడు పెళ్లి చేసుకుంటాడు? భక్త కన్నప్ప రీమేక్ ఎప్పుడు? లాంటి ప్రశ్నల్ని ఇటు కృష్ణంరాజును, అటు ప్రభాస్ ను అడక్కపోవడమే బెటరేమో.