Advertisement

Advertisement


Home > Movies - Movie News

కృష్ణ… రఫ్..అండ్ పవర్ ఫుల్

కృష్ణ… రఫ్..అండ్ పవర్ ఫుల్

ఒకప్పుడు రియలిస్టిక్, రగ్డ్ సినిమాలు వస్తే మన వాళ్లు చూడరు. అవి తమిళం వాళ్లే చూస్తారు అనేవారు. రంగస్థలం సినిమాతో ఆ అభిప్రాయం మారిపోయింది. 

ఇప్పుడు తెలుగు ప్రేక్షకులు కూడా రియలిస్టిక్ సినిమాలు చూస్తున్నారు. ఆదరిస్తున్నారు. అందుకే నిర్మాతలు, దర్శకులు అలాంటి సినిమాలు చేయడానికి ధైర్యం చేస్తున్నారు. పోలీస్ అట్రాసిటీ మీద ఆ మధ్య నాంది అనే సినిమా వచ్చింది. జనం ఆదరించారు.

అలాంటి లైన్ కాదు కానీ, ఓ యువకుడి ప్రశాంతమైన జీవితాన్ని కెలికితే, అందులో పోలీసులు ఇన్వాల్వ్ అయితే ఏ మలుపులు తిరిగింది అనే కథతో సత్యదేవ్ హీరోగా తయారవుతున్న సినిమా కృష్ణమ్మ. ఈ సినిమా టీజర్ బయటకు విడుదల చేసారు. గతంలో జవాన్ సినిమాను నిర్మించిన కృష్ణ ఈ సినిమాకు నిర్మాత. ప్రముఖ దర్శకుడు కొరటాల శివ సమర్పకుడు. వివి గోపాలకృష్ణ దర్ళకుడు.

టీజర్ లో సత్యదేవ్ చాలా ఎమోషనల్ టచ్ తో రఫ్ లుక్ తో కనిపించాడు. ‘కృష్ణమ్మ మాదిరిగా ఎక్కడ పుట్టారో తెలియని నలుగురు, ప్రశాంతంగా బతికేస్తుంటే, వారిని ఎవరు ఎందుకు కెలికారు..’ అన్నది పాయింట్. టీజర్ లో పోలీస్ అట్రాసిటీ కాస్త ఎక్కువ మోతాదులోనే కనిపించింది. మరీ ఇంత రియలిస్టిక్ గా పోలీస్ అట్రాసిటీ వుంటే చూడ్డానికి కాస్త ధైర్యం కావాల్సిందే.

ఈ టీజర్ ను హీరో సాయి ధరమ్ తేజ్ ఆన్ లైన్ లో విడుదల చేసారు. 

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?