Advertisement

Advertisement


Home > Politics - Opinion

ప్రపంచానికి పొంచి ఉన్న మరో పెనుముప్పు

ప్రపంచానికి పొంచి ఉన్న మరో పెనుముప్పు

రష్యా వెళ్లి ఉక్రైన్ మీద పడడం చూసాం. చాలా దేశాలు చోద్యం చూస్తూ కూర్చున్నాయి తప్ప తైవాన్ వైపు నిలబడే సాహసం చేయలేదు. బలవంతుడు బలహీనుడ్ని కొడుతుంటే ఇతర బలవంతులు మౌనం వహించి ఆ బలవంతుడి పక్కనే నిలబడ్డారు తప్ప మరొకటి చేయలేదు. అంతా రాజకీయ, ఆర్థిక అవసరాలు. అయితే ఇప్పుడు అలాంటి పరిస్థితే మరొకటి తలెత్తబోతోంది. చైనా తన పొరుగు దేశం తైవాన్ మీద పంజా విసరడానికి సిద్ధంగా ఉంది. 

మావో జె డాంగ్ (మావో సే తుంగ్) ప్రపంచ ప్రసిద్ధ చైనా కమ్యూనిష్ట్ విప్లవకారుడు. అప్పటివరకు ఉన్న రాజరికాన్ని సమూలంగా పెకిలించేసి చైనా మొత్తాన్ని తన ఆధీనంలోకి తీసేసుకున్నాడు. ఆ ఊపులో టిబెట్ ను కూడా ఆక్రమించేసుకున్నాడు 1949లో. అప్పటి నుంచి బౌద్ధ మతగురువు ప్రస్తుత దలైలామా భారత్ లోనే తలదాచుకుంటున్నారు. ఈ దలైలామా దైవసామ్రాజ్యం మీద చైనా దాడిని, మావో నీడలో చైనా దాష్టికం ఎలా ఉంటుందో తెలిపే ఘట్టాలని "సెవెన్ ఇయర్స్ ఇన్ టిబెట్" అనే సినిమాలో కళ్లకు కట్టినట్లు చూపించారు. నెట్-ఫ్లిక్స్ లో ఉంది. తెలుసుకోవాలనుకునే వారు చూడొచ్చు. 

ఇక విషయానికొస్తే ఆ మావో అడుగుజాడల్లో నడుస్తున్నాడు ప్రస్తుత చైనా అధ్యక్షుడు జిన్ పెంగ్. మావో సిద్ధాంతాల ప్రకారం చైనా నుంచి విడిపడి స్వతంత్ర ప్రతిపత్తి చాటుకుంటున్న ప్రతి దేశాన్ని, దీవిని వెనక్కి లాక్కోవాలి. ఈ లెక్కలో టిబెట్, తైవాన్, హాంగ్ కాంగ్ వంటివి వస్తాయి. ఆల్రెడీ టిబెట్ పనైపోయింది. ఇక లిస్టులో తైవాన్ మీద కన్ను పడింది. 

తైవాన్ అనేది చైనాకి ఆగ్నేయంలో సౌత్ చైనా సీ లో ఉన్న ఒక చిన్న దీవి. పలు ఆగ్నేయాశియా దేశాల్ని తాకుతూ ఉన్న సౌత్ చైనా సీ రూట్ తైవాన్ మీదుగా వెళ్లాల్సిందే. 

తైవాన్ అనేది డిజిటల్ ప్రపంచానికి గుండెకాయలాంటింది. ఎందుకంటే మొబైల్స్, టాబ్స్, మైక్రో ఓవెన్స్, గీజర్స్, ఫ్రిడ్జులు...ఇలా ఎలక్ట్రానికి పరికారాలన్నింటికీ సెమి కండక్టర్స్ అవసరముంటుంది. అవి ప్రపంచవ్యాప్తంగా 75% తైవాన్లోనే తయారవుతున్నాయి. ఆఖరికి చైనా కూడా తైవాన్ నుంచి దిగుమతి చేసుకోవల్సినిందే. 

అన్నింటినీ కాపీ కొట్టే చైనా ఈ సెమి కండక్టర్ వ్యాపారాన్ని మాత్రం కాపీ కొట్టలేకపోతోంది. ఎందుకంటే అది చాలా లెవల్స్ లో అత్యంత శ్రద్ధతో చేయాల్సిన పని. తైవాన్ అందులో రాటుదేలిపోయింది. దానిని బీట్ చేయడం చైనా కి కూడా కష్టమే. అందుకే పోటీ పడి నిరూపించుకునే కన్నా, ఆక్రమించుకుని సొంతం చేసుకోవడం తేలికనుకుంటోంది చైనా. 

కానీ తైవాన్ వాసుల్లో అధికులకి చైనా పోకడలు అస్సలు నచ్చవు. తాము చైనా గుప్పెట్లోకి వెళ్లితే స్వయం ప్రతిపత్తి పోతుందని వారి బాధ. అసలే వీరిలో దేశభక్తి పాళ్లు క్కువ. చైనా పట్ల విముఖత కూడా చాలా ఎక్కువ. 

ఇదిలా ఉంటే సౌత్ చైనా సీలో 3 ట్రిలియన్ డాలర్ల వ్యాపారం జరుగుతుంటుంది. తైవాన్ ని తమ ఆధీనంలో పెట్టుకుంటే రకరకాల సుంకాల రూపంలో చైనాకి అధికంగా రెవెన్యూ వస్తుంది. అందుకే చైనాకి తైవాన్ అంటే అంత తీపి. 

కార్యరూపం దాల్చలేదు కానీ చాలా ఏళ్ల్ల క్రితమే చైనా ఒక బులెటిన్ విడుదల చేసింది. దాని ప్రకారం:

1. చైనానుంచి విడిపడ్డ దేశాల్ని దేశంలో పునర్విలీనం చేయించడం చైనా కర్తవ్యం. 

2. ఇది పూర్తిగా అంతర్గత వ్యవహారం కాబట్టి ఏ ఇతర దేశమూ తలదూర్చడానికి వీల్లేదు.

3. చైనాలోంచి విడిపడ్డ ఏ దేశమైనా సొంత జెండా ఎగరవేస్తే అహింసాత్మకం కాని ప్రక్రియలద్వారా సదరు దేశాన్ని దారిలోకి తెచ్చుకుంటాం. 

ఇదీ వరస. ఈ పరిస్థితిల్లో భారత్ కచ్చితగా మళ్లీ మౌనం పాటిస్తుంది. అసలే కరోనా దెబ్బ, ఆ పైన ఉక్రైన్ యుద్ధం, ఆ తర్వాత రానున్న ఆర్ధికమాంద్యం..వీటితో పాటు పొంచి ఉన్న చైనా-తైవాన్ యుద్ధం. పైన చెప్పుకున్నట్టు తైవాన్ తో ప్రపంచానికి చాలా పెద్ద లింకుంది కనుక ఒకవేళ యుద్ధం రావడమంటూ జరిగితే కొన్నేళ్లవరకు పరిస్థితి ఛిన్నాభిన్నమే. 

అన్నట్టు మావో జెడాంగ్ కన్న కలలు మరికొన్ని ఉన్నాయి. వాటిల్లో ఒకటి ఐదువేళ్ల సిద్ధాంతం. టిబెట్ అరచేయి అనుకుంటే దానికి ఐదు వెళ్లు లడాఖ్, సిక్కిం, నేపాల్, భూటాన్, అరుణాచల్ ప్రదేశ్. 

టిబెట్ చైనాదే కనుక వేళ్లు కూడా చైనావే అనేది అతని భావన. ఎప్పటికైనా ఈ ఐదు ప్రాంతాల్ని చైనాలో కలుపుకోవాలని మావో స్వప్నం. కుదిరినంత వరకు దానిని కూడా సాకారం చేసుకునే దిశగా అడుగులేస్తోంది ప్రస్తుత చైనా నాయకత్వం. 

- హరగోపాల్ సూరపనేని

వలయంలో జగన్

నేను మొక్కలతో, దేముడితో మాట్లాడుతా