పవన్ తల్లిగా నన్ను అంగీకరించలేదు

'లక్ష్యం', 'లౌక్యం' వంటి సూపర్ హిట్ సినిమాల తరువాత హీరో గోపీచంద్, డైరెక్టర్ శ్రీవాస్‌ కలయికలో వస్తున్న హ్యాట్రిక్ ఫిల్మ్ 'రామబాణం'. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్, వివేక్ కూచిభొట్ల సంయుక్తంగా…

'లక్ష్యం', 'లౌక్యం' వంటి సూపర్ హిట్ సినిమాల తరువాత హీరో గోపీచంద్, డైరెక్టర్ శ్రీవాస్‌ కలయికలో వస్తున్న హ్యాట్రిక్ ఫిల్మ్ 'రామబాణం'. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్, వివేక్ కూచిభొట్ల సంయుక్తంగా భారీస్థాయిలో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రముఖ నటి కుష్బూ సినిమా గురించి పలు ఆసక్తికర విషయాలను మీడియాతో పంచుకున్నారు.

ఈ సినిమా ప్రధానంగా కుటుంబ బంధాల గురించి ఉంటుంది. మనం ఎంత డబ్బు సంపాదించినా, ఉన్నత స్థాయికి చేరినా.. కుటుంబ బంధం అనేది చాలా ముఖ్యం. అలాంటి కథతో ఈ చిత్రం రూపొందింది. అందుకే రామబాణం నాకు అంత దగ్గరైంది. ఇందులో నా పాత్ర మనం మరిచిపోతున్న సంప్రదాయాలు, ఆహార వ్యవహారాలను గుర్తు చేసేలా ఉంటుంది. ప్రస్తుతం మన తింటున్న ఫాస్ట్ ఫుడ్ వల్ల అనేక అనారోగ్య సమస్యలు వస్తున్నాయి. సంప్రదాయ ఆహారం విలువని తెలిపేలా నా పాత్ర ఉంటుంది. నా పాత్ర పేరు భువనేశ్వరి.

గోపీచంద్ తో కలిసి మొదటిసారి నటించాను. సెట్స్ లో గోపీచంద్ చాలా సైలెంట్ గా ఉంటారు. ఆయన పనేదో ఆయన చేసుకొని వెళ్లిపోతుంటారు. కారవాన్ లో కంటే ఎక్కువగా లొకేషన్ లో కుర్చీలో కూర్చోడానికే ఇష్టపడతారు. జగపతిబాబు నటుడు కాకముందు నుంచే నాకు తెలుసు. బాల నటిగా వారి బ్యానర్ జగపతి ఆర్ట్స్ లో రెండు సినిమాలు చేశాను. ఆయన మంచి మనసున్న వ్యక్తి. నేను చౌ మామ అని పిలుస్తాను.

ఈ సినిమాలో చాలా మంచి సందేశం ఉంటుంది. ఎలాంటి పరిస్థితులు ఎదురైనా కుటుంబమంతా కలిసి ఉండాలని, ఆరోగ్యకరమైన జీవితాన్ని గడపాలని ఈ సినిమా చెబుతుంది.

మంచి సినిమాలు చేయాలనే ఆలోచనతో పాత్రలు ఎంచుకుంటున్నాను. గ్లామర్ రోల్స్ చేశాం, డ్యాన్స్ లు చేశాం.. అవన్నీ అయిపోయాయి. ప్రేక్షకులు సినిమా చూసే కోణం కూడా మారింది. ఎలాంటి పాత్రలు చేస్తున్నారని చూస్తున్నారు. ప్రేక్షకుల మనసుల్లో స్థానం సంపాదించుకునే పాత్రలు పోషించాలి. అలాంటి పాత్రనే రామబాణం లో చేశాను. అజ్ఞాతవాసి లో మంచి పాత్ర పోషించాను. కానీ నన్ను, పవన్ కల్యాణ్ తల్లిలా ప్రేక్షకులు అంగీకరించలేదు అనుకుంటాను. ఆ సినిమా ఆశించిన ఫలితాన్ని అందుకోలేకపోయింది. వారిసు(వారసుడు)లో 18 నిమిషాల నిడివి గల బలమైన పాత్రను పోషించాను.. కానీ సినిమా నిడివి ఎక్కువ కావడంతో తప్పనిసరి పరిస్థితుల్లో నా పాత్రను తొలగించారు. తెలుగులో ఇంకా మంచి మంచి పాత్రలు చేయాలని ఉంది.

అమితాబ్ బచ్చన్ తో కలిసి చీని కం లో టబు నటించింది. ఆ ఛాన్స్ టబు కొట్టేసినందుకు ఫీల్ అయ్యాను. ఎందుకంటే నేను అమితాబ్ కు చాలా పెద్ద ఫ్యాన్ ని. నా ఇంట్లో ఆయన పోస్టర్స్ కూడా ఉంటాయి. అమితాబ్ గారితో చైల్డ్ఆర్టిస్ట్ గా చేశాను కానీ ఆయనకు జోడీగా చేయలేదనే బాధ ఉంది.