జీవితంలో అన్ని వైపుల నుంచి తగులుతున్న దెబ్బలు మనిషిని రాటు తేలేలా చేస్తారు.
హీరోయిన సమంత పరిస్థితి ఇలాగే వుందేమో. మగడితో విడాకులు..అనారోగ్యం..సినిమా ఫ్లాప్ కావడం మొత్తం మీద రాటు తేలిపోయినట్లే. పైగా ఆధ్యాత్మిక చింతన కూడా ఎక్కువే వుంది కూడా. అందుకే భగవద్గీత పాఠాలు వల్లెవేస్తున్నట్లు కనిపిస్తోంది.
తెలుగులో హీరో- హీరోయిన్ సినిమాలకు సమంత ను తీసుకునే చాన్స్ తక్కువ. హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాలే శరణ్యం. ప్రస్తుతం చేస్తున్న ఖుషీ సినిమా తరువాత మరో సినిమా అయితే ఏదీ అనౌన్స్ కాలేదు. ఖుషీ హిట్ అయి, మాంచి పేరు వస్తే అప్పుడు చాన్స్ లు ఏమైనా వుండొచ్చు. శాకుంతలం సినిమా మీద గంపెడు ఆశలు పెట్టుకుంది. యశోద మాదిరిగా ఈ సినిమా కూడా బాక్సాఫీస్ దగ్గర క్లిక్ అయి వుంటే హీరోయిన్ ఓరియెంటెడ్ కథలు సమంత ను వెదుక్కుంటూ వచ్చేవి. ప్రస్తుతానికి అయితే అనౌన్స్ మెంట్లు లేవు. అన్నీ చర్చల్లోనే.
అందుకే కర్మణ్యే వాధికారస్తే…అంటూ ఇన్ స్టా లో భగవద్గీత శ్లోకం పోస్ట్ చేసింది. నిజానికి ఎవరైనా అంతే. డూ యువర్ డ్యూటీ..రిజల్ట్ కోసం ఆశించకు అన్నదే కథ ఆ శ్లోకం అర్థం పరమార్థం. అదే అనుకుంటూ సమంత ఖుషీ సెట్ మీదకు వెళ్లిపోతోంది. తప్పదు.. అరివీర భయంకర డిజాస్టర్ ను తలుచుకుంటూ ఎన్నాళ్లు కూర్చుంటారు ఎవరైనా?