నయనతార- ప్రభుదేవాలది ఒక అనూహ్యమైన ప్రేమకథ. నయనతార కోరుకుంటే.. ప్రభుదేవా కన్నా అందగాళ్లు, డబ్బున్న వాళ్లు, స్టార్ డమ్ ఉన్న వాళ్లు.. అప్పుడూ,ఇప్పుడూ దొరుకుతారు! అయితే ఆమె అప్పటికే పెళ్లై, వయసు కూడా చాలానే ఉన్న ప్రభుదేవాను ఇష్టపడింది. కొన్నాళ్ల పాటు వారి ప్రేమకథ సజావుగా సాగింది. ఆ సమయంలో వారిపై తీవ్రంగా విరుచుకుపడిన వారిలో ముందుండుంది ప్రభుదేవా భార్య లత.
ప్రభుదేవా- నయనతారల ప్రేమ వార్తల నేపథ్యంలో మీడియా అప్పట్లో తన ఇంటర్వ్యూల కోసం బాగా ఆసక్తి చూపింది. అందుకు తగ్గట్టుగా ఆమె మీడియాతో మాట్లాడుతూ నయనతార మీద దుమ్మెత్తి పోసింది. ఎంతగా అంటే.. తనకు నయనతార ఎదురైతే ఆమెను ఈడ్చి తన్నడం గ్యారెంటీ అంటూ ఆమె బాహాటంగా హెచ్చరికలు జారీ చేసింది. నయనతారను చెడు స్త్రీగా అభివర్ణించింది లత.
తన భర్త బంగారం అన్నట్టుగా, ఆమె మాత్రం అతడిని ఎగరేసుకుపోయిందని లత సగటు భారతీయ మహిళలానే మాట్లాడింది. అయితే ఆమె మాటలకు కూడా ప్రభుదేవా పొంగిపోలేదు. ఆమెకు విడాకులు ఇచ్చాడు. నయనతారను పెళ్లి చేసుకోవడానికంటూ ఆమెకు విడాకులు ఇచ్చాడు. ఏం చెప్పాడో కానీ, ఆమె కూడా అంగీకారం తెలిపింది. ఇక నయనతార- ప్రభుదేవాల పెళ్లే అనే సమయంలో కథ అడ్డం తిరిగిన సంగతీ తెలిసిందే.
బ్రేకప్ గురించి రీజన్ ఏమీ చెప్పలేదు కానీ, ప్రభుదేవాతో విడిపోయిన విషయాన్ని నయనతార ప్రకటించింది. ఎగవది ఎక్కిపాయె, దిగవది దిగిపాయె.. అన్నట్టుగా మారింది ప్రభుదేవా పరిస్థితి. భార్యకు తను విడాకులు ఇస్తే, ప్రియురాలు బ్రేకప్ చెప్పింది. అప్పటి నుంచి అధికారికంగా ప్రభుదేవా సింగిల్ గా ఉన్నట్టే లెక్క. అయితే కెరీర్ పరంగా మాత్రం బిజీగానే ఉంటున్నాడు. ఇక నయనతార విఘ్నేష్ శివన్ రూపంలో మరో ప్రేమికుడిని చూసుకుంది. ప్రేమకథను కొనసాగిస్తూ ఉంది. శింబుతో మొదలు.. నయనతారవన్నీ చిత్రమైన ప్రేమకథలే!