Advertisement

Advertisement


Home > Movies - Movie News

నవ్వించిన ఏడుపు..!

నవ్వించిన ఏడుపు..!

డబ్బులుంటే చాలు సినిమా తీసేయాలి.. హీరో అయిపోవాలని కొంతమంది ప్రయత్నిస్తూ ఉంటారు.. కానీ ఆడియన్స్ మాత్రం అవేమీ చూడరు టాలెంట్ ఉంటేనే ఆఫరిస్తారు. 

ఇది ఇప్పటికే చాలా సార్లు రుజువైంది. తాజాగా ఓ వ్యక్తి సినిమా పై మక్కువతో ఏకంగా 51 ఏళ్లకు హీరోగా ఎంట్రీ ఇచ్చాడు ప్రముఖ వ్యాపారవేత్త అరుళ్ శరవణన్. వ్యాపారవేత్తగా మోడల్ గా శరవణన్ పాపులర్ అయ్యారు.

 ఇటీవలే ది లెజెండ్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమాను భారీ బడ్జెట్ తో గ్రాండ్ గా రిలీజ్ కూడా చేశారు. అయితే ఈ హీరోగారు ఇప్పుడు తెగ ట్రెండ్ అవుతున్నారు.. అదెలా అనుకుంటున్నారా.. మన హీరోగారి వయసు, లుక్స్ , యాక్టింగ్ పై కొందరు నెటిజన్లు తెగ ట్రోల్స్ చేస్తున్నారు.

తాజాగా శరవణన్ కు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈ సినిమాలోని ఓ ఎమోషనల్ సీన్ చూసి ఆడియన్స్ తెగ నవ్వుకుంటున్నారు.. లెజెండ్ సినిమాలోని క్లిప్పింగ్స్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. 

ఈ సినిమాలో ఓ సీన్ లో హీరో భార్య చనిపోతుంది.. దాంతో హీరో ఎమోషనల్ అయ్యే సీన్ ఉంది. ఈ సినిమా చూసిన ప్రేక్షకులు హీరోగారి ఎక్స్ప్రెషన్స్ కు థియేటర్స్ లో తెగ నవ్వుకుంటున్నారు. ఇప్పుడు ఈ వీడియో నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా బాలీవుడ్ హాట్ బ్యూటీ ఊర్వశీ రౌతేలా నటించింది. అంతే కాదు చాలా మంది స్టార్ కాస్ట్ ఈ సినిమాలో నటించారు.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?