అవన్నీ పుకార్లు.. నమ్మొద్దు ప్లీజ్

సౌత్ లో సూపర్ హిట్టయిన ఫ్రాంచైజీల్లో ఒకటి కాంచన. ఈ సిరీస్ నుంచి వచ్చిన సినిమాలన్నీ క్లిక్ అయ్యాయి. ఈమధ్య వచ్చిన కాంచన-3 కూడా సక్సెస్ అయింది. దీంతో కాంచన-4 పై అంచనాలు పెరిగాయి.…

సౌత్ లో సూపర్ హిట్టయిన ఫ్రాంచైజీల్లో ఒకటి కాంచన. ఈ సిరీస్ నుంచి వచ్చిన సినిమాలన్నీ క్లిక్ అయ్యాయి. ఈమధ్య వచ్చిన కాంచన-3 కూడా సక్సెస్ అయింది. దీంతో కాంచన-4 పై అంచనాలు పెరిగాయి.

పెరిగిన అంచనాలకు తగ్గట్టుగానే, పుకార్లు కూడా ఎక్కువయ్యాయి. ఈ సినిమాలో మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా సెలక్ట్ అయినట్టు వార్తలొచ్చాయి. దీనిపై లారెన్స్ స్పందించాడు. అవన్నీ పుకార్లుగా కొట్టి పారేశాడు.

“కాంచన 4కు సంబంధించి, ఆ సినిమాలో కాస్టింగ్ కు సంబంధించి సోషల్ మీడియాలో వస్తున్న కథనాలన్నీ పుకార్లు. రాఘవేంద్ర ప్రొడక్షన్ బ్యానర్ పై అధికారిక ప్రకటన త్వరలోనే వస్తుంది.”

ఇలా మృణాల్ ఠాకూర్ పేరును ప్రస్తావించకుండా, సోషల్ మీడియాలో నడుస్తున్న వార్తలన్నింటినీ పుకార్లుగా కొట్టిపారేశాడు లారెన్స్. ఈ ఫ్రాంచైజీలో నటించిన హీరోయిన్లందరికీ మంచి గుర్తింపు వచ్చింది. అలాంటి క్రేజ్ సిరీస్ లో మృణాల్ నటించబోతోందని అంతా ఫిక్స్ అయ్యారు. కానీ లారెన్స్ మాత్రం ఖండించాడు.

కాంచన-4ను సెప్టెంబర్ లో ప్రారంభించబోతున్నారు. దీనికి సంబంధించి ప్రీ ప్రొడక్షన్ వర్క్ లో లారెన్స్ బిజీగా ఉన్నాడు. హారర్-కామెడీ జానర్ లో వచ్చే ఈ సినిమాలు లారెన్స్ కు మంచి గుర్తింపు తెచ్చిపెట్టాయి.