పుష్ప-2 సినిమాకు లీకులు కొత్త కాదు. ఎప్పటికప్పుడు సెట్ ఫొటోలు, ఆన్-లొకేషన్ స్టిల్స్ లీక్ అవుతూనే ఉన్నాయి. యూనిట్ ఎన్ని చర్యలు తీసుకుంటున్నప్పటికీ ఈ లీకుల పరంపర మాత్రం ఆగట్లేదు. బాధాకరమైన విషయం ఏంటంటే.. ఇంకా అది కొనసాగుతూనే ఉంది. తాజాగా రష్మిక స్టిల్స్ బయటకొచ్చాయి.
పుష్ప-2 సినిమాలో శ్రీవల్లి పాత్రలో కనిపించనుంది రష్మిక. సినిమా షూటింగ్ నుంచి ఆమె స్టిల్స్ లీక్ అయ్యాయి. పుష్ప పార్ట్-1లో పేదమ్మాయిగా కనిపించింది రష్మిక. అందుకు తగ్గట్టే తక్కువ మేకప్ లో, మిడిల్-క్లాస్ దుస్తుల్లో ఆమె కనిపించింది. అయితే పుష్ప-2లో ఆమె పుష్పరాజ్ భార్య శ్రీవల్లి.
కాబట్టి పార్ట్-2లో రష్మికను రిచ్ గా చూపించారు. పట్టుచీరలు, ఒంటి నిండా నగలతో ధగధగ మెరిసిపోతోంది. దీనికి సంబంధించిన స్టిల్స్, సెట్ నుంచి లీక్ అయ్యాయి. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ యాగంటిలో జరుగుతోంది. మరోవైపు రామోజీ ఫిలింసిటీలో కూడా సమాంతరంగా షూటింగ్ నడుస్తోంది.
సందడి చేసిన బన్నీ… ఈరోజు 2 విషయాల్లో సందడి చేశాడు బన్నీ. ఖైరతాబాద్ లోని ఆర్టీవో ఆఫీస్ లో కనిపించాడు. స్వయంగా అధికారులు ఎదురెళ్లి, అల్లు అర్జున్ కు స్వాగతం పలికారు. చాలామంది ఫ్యాన్సీ నంబర్ కోసం బన్నీ ఆఫీస్ కు వచ్చాడని అనుకున్నారు. కానీ అతడు ఇంటర్నేషనల్ డ్రైవింగ్ లైసెన్స్ కోసం వచ్చాడు. దరఖాస్తు చేశాడు. అధికారులు దగ్గరుండి బన్నీతో ఆ ఫార్మాలిటీస్ అన్నీ పూర్తిచేశారు. ఇక రెండో విషయం, ఇనస్టాగ్రామ్ లో బన్నీ మరో ఘనత సాధించాడు. 25 మిలియన్ ఫాలోవర్స్ సాధించిన టాలీవుడ్ నటుడిగా గుర్తింపు పొందాడు.