Advertisement

Advertisement


Home > Politics - National

అత్యంత సంతోషకరమైన దేశం ఇదే

అత్యంత సంతోషకరమైన దేశం ఇదే

ప్రపంచంలో అత్యంత సంతోషకరమైన దేశం ఏది? ఈ ప్రశ్నకు ఫిన్లాండ్ అనే జవాబు స్థిరపడిపోయేలా ఉంది. ఎందుకంటే, గడిచిన ఏడేళ్లుగా ఈ దేశమే, అత్యంత సంతోషకరమైన దేశంగా నంబర్-1 స్థానంలో కొనసాగుతోంది. తాజాగా విడుదల చేసిన వరల్డ్ హ్యాపీనెస్ రిపోర్ట్ లో ఫిన్లాండ్ తర్వాత, డెన్సార్క్, ఐస్ ల్యాండ్, స్వీడన్ నిలిచాయి. ప్రస్తుతం యుద్ధంలో ఉన్న ఇజ్రాయెల్, హ్యాపీయస్ట్ కంట్రీస్ జాబితాలో ఐదో స్థానంలో నిలవడం విశేషం.

ఇక ఈ జాబితాలో అట్టడుగు స్థానంలో ఆఫ్ఘనిస్థాన్ నిలిచింది. ఈ దేశంతో పాటు.. కాంగో, సియర్రా లియోన్, లెబనాన్, లెసోతో దేశాల్లో ప్రజలు అత్యల్ప సంతోషంగా ఉన్నట్టు నివేదిక వెల్లడించింది.

భారత్ విషయానికొస్తే.. లిస్ట్ లో ఇండియా 126వ స్థానంలో నిలిచింది. చైనా (60), నేపాల్ (93), పాకిస్థాన్ (108), మయన్మార్ (118) ఇండియా కంటే మెరుగైన పొజిషన్స్ లో ఉన్నాయి.

నివేదిక ప్రకారం, భారత్ లో సంతృప్త స్థాయి వృద్ధాప్యంతో ముడిపడి ఉండడం విశేషం. ఇందులో కూడా విద్య, కులం కీలక పాత్రలు పోషించాయి. ఉన్నత విద్య చదివిన వృద్ధులు, ఉన్నత విద్యతో పాటు ఉన్నత సామాజిక వర్గానికి చెందిన వృద్ధులు, నిమ్న సామాజిక వర్గానికి చెందిన వృద్ధుల కంటే సంతోషంగా ఉన్నట్టు నివేదిక పేర్కొంది. షెడ్యూల్ తెగలు, షెడ్యూల్ కులాలకు చెందిన వృద్ధులతో పాటు, ఇతర వయష్కులు కూడా అల్ప సంతోషంతో ఉన్నట్టు పేర్కొన్నారు.

ఇక యువత విషయానికొస్తే.. 30 ఏళ్లు, అంతకంటే తక్కువ వయసున్న వ్యక్తుల్లో సంతోషంగా ఉన్న వాళ్లు ఎక్కువగా లిధువేనయా మొదటి స్థానంలో నిలవగా.. ఇజ్రాయెల్, సెర్బియా, ఐస్ ల్యాండ్, డెన్మార్క్ తర్వాత స్థానాల్లో ఉన్నాయి. ఈ విభాగంలో భారత్ 127వ స్థానంలో ఉఁది.

గతేడాది 13వ స్థానంలో ఉన్న అగ్రరాజ్యం అమెరికా ఈసారి 23వ స్థానానికి పడిపోయింది. కెనడా 15వ స్థానంలో, బ్రిటన్ 20వ స్థానంలో, జర్మనీ 24వ స్థానంలో ఉన్నాయి.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?