లియో ఓటీటీలోకి వచ్చేసింది. సినిమాకు రికార్డ్ వ్యూస్ వస్తున్నాయి. ఏదైతే అదనంగా జోడించారో, ఆ సన్నివేశాల్ని విజయ్ ఫ్యాన్స్ ఫుల్ గా ఎంజాయ్ చేస్తున్నారు. స్క్రీన్ షాట్స్ షేర్ చేస్తున్నారు. ఇప్పుడీ సినిమాకు సంబంధించి మరో క్రేజీ అప్ డేట్.
లియో సినిమా ఇప్పటికే తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో స్ట్రీమింగ్ అవుతోంది. ఇప్పుడీ సినిమాను త్వరలోనే ఇంగ్లిష్ వెర్షన్ లో కూడా తీసుకురాబోతున్నారు. ఈ విషయాన్ని నెట్ ఫ్లిక్స్ స్వయంగా ప్రకటించింది.
ఇండియన్ లాంగ్వేజెస్ కోసం లియో రన్ టైమ్ ను కాస్త పెంచి స్ట్రీమింగ్ లోకి తీసుకొచ్చిన నెట్ ఫ్లిక్స్ సంస్థ, ఇంగ్లిష్ వెర్షన్ కోసం సినిమాను కుదిస్తోంది. వీలైనంత ఆసక్తికరంగా సినిమాను మార్చి, అటుఇటుగా 2 గంటల్లో సినిమాను ఇంగ్లిష్ వెర్షన్ లో తీసుకొచ్చే ప్రయత్నం చేస్తోంది.
ప్రస్తుతం లియో సినిమా ఇండియాలో మాత్రమే స్ట్రీమింగ్ అవుతోంది. మంగళవారం నుంచి ప్రపంచవ్యాప్తంగా ఇది అందుబాటులోకి వస్తుంది. ఆ తర్వాత కొన్ని రోజులకు ఇంగ్లిష్ వెర్షన్ ను తీసుకొస్తారు.
లోకేష్ కనగరాజ్ డైరక్ట్ చేసిన ఈ సినిమాలో విజయ్-త్రిష హీరోహీరోయిన్లుగా నటించారు. అనిరుధ్ సంగీతం అందించాడు.