చేసింది ఒక్క సినిమానే. కానీ రష్మికకు సంబంధించి చాలా సీక్రెట్స్ తెలుసుకున్నాడు హీరో రణబీర్ కపూర్. ఆమెకు చెందిన చాలా విషయాల్ని బయటపెట్టాడు.
రష్మిక, విజయ్ దేవరకొండ ఎక్కువగా ఎక్కడ మాట్లాడుకుంటారు? దీనికి సమాధానం రణబీర్ కు తెలుసు. ఇద్దరూ ఎక్కువగా విజయ్ దేవరకొండ ఇంటి మేడ మీద మాట్లాడుకుంటారట. దర్శకుడు సందీప్ రెడ్డి కూడా రష్మికను తొలిసారిగా, విజయ్ దేవరకొండ ఇంట్లో మేడ పైన కలుసుకున్నాడట.
అంతేకాదు, విజయ్ దేవరకొండ పేరును రష్మిక తన మొబైల్ లో ఏమని సేవ్ చేసుకుందో కూడా రణబీర్ కు తెలుసు. విజయ్ దేవరకొండకు ఆమె కాల్ చేయడానికి ప్రయత్నిస్తుంటే, 'ఫోన్ స్క్రీన్ కెమెరా కంటికి కనిపించనీయకు' అంటూ రణబీర్ సుతారంగా హెచ్చరించాడు. అంటే, విజయ్ దేవరకొండ పేరును రష్మిక ఏమని సేవ్ చేసుకుందో రణబీర్ కు ఆల్రెడీ తెలుసన్నమాట.
అంతేకాదు.. స్పీకర్ ఆన్ చేసి ఫోన్ లో మాట్లాడుతుంటే.. స్పీకర్ ఆన్ చేసి ఉందని విజయ్ దేవరకొండకు చెప్పమని, రష్మికకు సూచించాడు రణబీర్. ఇలా ఒకటి కాదు, రష్మికకు చెందిన చాలా విషయాలు తెలుసుకున్నాడు. అర్జున్ రెడ్డి ఇష్టమా, యానిమల్ ఇష్టమా అంటూ రష్మికను ఇరకాటంలో కూడా పెట్టాడు.
బాలకృష్ణ హోస్ట్ చేస్తున్న అన్ స్టాపబుల్ కార్యక్రమానికి రష్మిక, రణబీర్, సందీప్ రెడ్డి హాజరయ్యారు. ఈ షోలో రష్మికకు సంబంధించి చాలా వివరాలు బయటపెట్టడమే కాకుండా, ఆమెను ఓ రేంజ్ లో ఆటపట్టించాడు. కార్యక్రమంలో విజయ్ దేవరకొండ ఎపిసోడ్ నడిచినంతసేపూ రష్మిక బుగ్గలు సిగ్గుతో కందిపోయాయి. ఆ విషయాన్ని కూడా రణబీర్ గుర్తించడం విశేషం.