Advertisement

Advertisement


Home > Movies - Movie News

పాపం రవితేజ.. ఈసారి ఇలా బుక్కయిపోయాడు

పాపం రవితేజ.. ఈసారి ఇలా బుక్కయిపోయాడు

అల్లుఅర్జున్, మహేష్ ఓ రేంజ్ లో పోటీపడుతున్నారు. అసలు వసూళ్లను పక్కనపెట్టి, కొసరు పోస్టర్లతో ఓ రేంజ్ లో కొట్టుకుంటున్నారు. దీనివల్ల ఎవరికి లాభం అనే సంగతి పక్కనపెడితే, ఒకరికి మాత్రం తీవ్రంగా నష్టం. అవును.. ఈ రెండు సినిమాలతో ఏమాత్రం సంబంధం లేని రవితేజ ఇప్పుడు నష్టపోతున్నాడు. మహేష్, బన్నీ ఇద్దరూ బాక్సాఫీస్ నుంచి కదలకపోవడంతో రవితేజకు ఇప్పుడు థియేటర్ల సమస్య ఎదురైంది.

మరో 2 రోజుల్లో రిలీజ్ అవుతోంది డిస్కోరాజా. భారీ ఎత్తున రిలీజ్ చేయాలని అటు హీరోకు, ఇటు నిర్మాత రామ్ కు ఉన్నప్పటికీ అక్కడ థియేటర్లు లేవు. అల వైకుంఠపురములో, సరిలేరు నీకెవ్వరు సినిమాల మధ్య పోటీ ఇంకా కొనసాగుతున్న వేళ.. డిస్కోరాజాకు థియేటర్ల కేటాయింపు అగమ్యగోచరంగా మారింది. 

థియేటర్స్ కౌంట్ పరంగా ఏపీ, నైజాంలో ఇప్పటికీ ఈ రెండు సినిమాలదే హవా. ఒక్కటంటే ఒక్క సెంటర్ నుంచి కూడా సినిమాను తప్పించడానికి ఎవ్వరూ ఇష్టపడడం లేదు. దీంతో డిస్కోరాజాకు అనుకున్న స్థాయిలో స్క్రీన్స్ దొరకడం లేదు. ఇదే ఒక దెబ్బ అనుకుంటే.. ఆరోజున స్ట్రీట్ డాన్సర్3 అనే సినిమా వస్తోంది. ఈ బాలీవుడ్ మూవీ కోసం చాన్నాళ్ల కిందటే మల్టీప్లెక్సులన్నీ బుక్ చేశారు. 

ప్రస్తుతానికైతే డిస్కోరాజాకు తెలంగాణలో వంద స్క్రీన్స్, ఆంధ్రప్రదేశ్ లో అటుఇటుగా 160 స్క్రీన్స్ మాత్రమే దొరికాయి. ప్రస్తుతం ఈ యూనిట్ చూపంతా దర్బార్, ఎంత మంచివాడవురా సినిమాలపైనే ఉంది. ఈ శుక్రవారం నాటికి ఏపీ, నైజాంలోని కొన్ని థియేటర్ల నుంచి ఈ రెండు సినిమాల్ని తప్పించే అవకాశం ఉంది. అవి తప్పుకుంటే తప్ప రవితేజకు థియేటర్లు దొరకని పరిస్థితి. 

అసలే సక్సెస్ లేక ఇబ్బంది పడుతున్నాడు రవితేజ. ఏడాదికి మినిమం 3 సినిమాలు చేసే ఈ హీరో, అమర్ అక్బర్ ఆంటోనీ దెబ్బకు గతేడాది ఒక్క సినిమా కూడా రిలీజ్ చేయలేకపోయాడు. డిస్కోరాజాపైనే ఆశలన్నీ పెట్టుకున్నాడు. ఇలాంటి టైమ్ లో ఊహించని విధంగా వచ్చిన మహేష్-బన్నీ వార్, రవితేజను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది.

చేతకాని సంస్కార హీనులు మీరు

బుచ్చయ్య చౌదరి తొడలు కొట్టుకుంటూ అసెంబ్లీ లో తిరుగుతున్నాడు ​

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?