కేవలం సినిమాలు ఇలా ప్రకటించి, అలా సెట్స్ పైకి వెళ్లడం లేదు చిరంజీవి. సినిమా లాంఛింగ్ టైమ్ లోనే ప్రీ-లుక్ రిలీజ్ చేస్తున్నారు. అలా మూవీలో తన కొత్త గెటప్ ఎలా ఉండబోతోందనే విషయంపై ఆడియన్స్ కు ఓ క్లారిటీ ఇస్తున్నారు. ఈ క్రమంలో రేపు ప్రారంభంకాబోతున్న భోళాశంకర్ సినిమా కోసం కూడా ప్రీ లుక్ రెడీ అయింది.
రేపు ఉదయం 7 గంటల 45 నిమిషాలకు భోళాశంకర్ సినిమా పూజాకార్యక్రమాలతో ప్రారంభం కాబోతోంది. ఈ సినిమా కోసం 2 రోజుల కిందటే లుక్ టెస్ట్ పూర్తిచేశారు చిరంజీవి. ఓ స్పెషల్ లుక్ లో చిరంజీవిపై ఫొటో షూట్ నిర్వహించారు. ఆ స్టిల్ ను రేపు రిలీజ్ చేయబోతున్నారు.
తన ప్రతి సినిమాకు ఈ పద్ధతి ఫాలో అవుతున్నారు చిరంజీవి. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై బాబితో చేయాల్సిన సినిమా కోసం మాస్ లుక్ లోకి మారారు. గాడ్ ఫాదర్ కోసం కూడా స్పెషల్ ఫొటోషూట్ చేశారు.
ఇప్పుడు మెహర్ రమేష్ దర్శకత్వంలో చేయబోతున్న భోళాశంకర్ కోసం కూడా ప్రీ-లుక్ ఫొటోషూట్ నిర్వహించారు. పూజాకార్యక్రమాలతో పాటు ఆ లుక్ ను రేపు రివీల్ చేయబోతున్నారు.
గతంలోనే చిరు-కీర్తిసురేష్ కాంబినేషన్ లో ఓ వీడియో వచ్చింది. అయితే అందులో చిరు లుక్ కు, భోళాశంకర్ కు సంబంధం లేదంటోంది యూనిట్. భోళాశంకర్ లో హీరోయిన్ గా తమన్నను తీసుకున్న విషయం తెలిసిందే.
ఇక ఇందులో చిరంజీవికి చెల్లెలిగా కీర్తిసురేష్ నటించనుంది. ఏకే ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై రాబోతున్న ఈ సినిమాకు మహతి స్వరసాగర్ సంగీతం అందిస్తున్నాడు.