కరోనా కారణంగా విడుదల ఆగిన సినిమా లవ్ స్టోరీ. ఇటు శేఖర్ కమ్ముల ఫ్యాన్స్ అటు సాయి పల్లవి ఫ్యాన్స్ ఆతృతగా ఎదురుచూస్తున్న సినిమా ఇది.
ఫిదా సినిమా తరువాత సాయిపల్లవి-శేఖర్ కమ్ముల కలిసి చేసే మ్యాజిక్ ఎలావుంటుందో అని ఆతృతగా ఎదురుచూస్తున్నారు సినిమా అభిమానులు. దానికి తోడు 'సారంగదరియా' పాట జనాలను ఊపేసింది. ఇంకా ఊపేస్తోంది కూడా.
సారంగ దరియాలో సాయిపల్లవి డ్యాన్స్ మూవ్ మెంట్స్ లవ్ స్టోరీ సినిమా మీద అంచనాలను అమాంతం పెంచేసాయి. అంతే కాదు, సినిమాలో మిగిలిన పాటలు కూడా చార్ట్ బస్టర్ లుగా నిలిచాయి. ఇలాంటి సినిమాను విడుదల చేయాలంటే ఏదో ఒక అడ్డంకి.
కరోనా సమస్య, టికెట్ రేట్లు, సెకెండ్ షో లేకపోవడం, యాభై శాతం ఆక్యుపెన్సీ ఇలా సవాలక్ష. ఇప్పుడు వీటన్నింటినీ అధిగమించినా, అధిగమించకపోయినా మొత్తానికి డేట్ మాత్రం ఫిక్స్ అయిపోయింది. బుధవారం ప్రకటించబోతున్నారు.
సినిమా విడుదల వేళకు సెకెండ్ షో వస్తుందని, రేట్లు మారతాయని నిర్మాత ఆసియన్ సునీల్ ఆశాభావంతో వున్నారు. సినిమా సెన్సారు అయిపోయింది. ఫైనల్ కాపీని కూడా రెడీ చేస్తున్నారు.