లవ్ స్టోరీ మళ్లీ వాయిదా

చైతన్య-సాయిపల్లవి ల కాంబినేషన్ లోని లవ్ స్టోరీ సినిమా మళ్లీ వాయిదా పడింది. సెప్టెంబర్ 10 విడుదల కావాల్సిన ఈ సినిమాను మళ్లీ ఎప్పుడు విడుదల చేసేదీ ఇంకా డిసైడ్ చేయలేదు.  Advertisement ఆంధ్రలో…

చైతన్య-సాయిపల్లవి ల కాంబినేషన్ లోని లవ్ స్టోరీ సినిమా మళ్లీ వాయిదా పడింది. సెప్టెంబర్ 10 విడుదల కావాల్సిన ఈ సినిమాను మళ్లీ ఎప్పుడు విడుదల చేసేదీ ఇంకా డిసైడ్ చేయలేదు. 

ఆంధ్రలో రేట్లు లేకపోవడం, సెకెండ్ షో లు లేకపోవడంతో వాయిదా వేసినట్లు తెలుస్తోంది. అలాగే థియేటర్లకు జనాలు రావడం కూడా ఇంకా పెరగలేదు. అది కూడా ఓ కారణం. 

ఇదిలా వుంటే 3న విడుదల కావాల్సిన సంపత్ నంది-గొపీచంద్ కాంబినేషన్ లోని సీటీమార్ సినిమాను 10 కి వాయిదా వేసే దిశగా డిస్కషన్లు సాగుతున్నాయి. 

దాదాపు అదే ఖరారు కావచ్చు. కానీ దర్శకుడు సంపత్ నందికి ఇలా వాయిదా వేయడం ఇష్టం లేదని తెలుస్తోంది. 3 మంచి డేట్ అని ఆయన అభిప్రాయపడుతున్నారు. అయితే తుది నిర్ణయం నిర్మాతకు వదిలేసారు. 

మొత్తానికి కరోనా రెండో దశ తరువాత థియేటర్ల పరిస్థితి ఏమాత్రం బాగాలేదు. సినిమాలు విడుదలవుతున్నా, టాక్ ఎలా వున్నా, కలెక్షన్లు మాత్రం పెద్దగా కుమ్మేయడం లేదు. దాంతో సినిమాలు విడుదల చేయడానికే నిర్మాతలు జంకుతున్నారు.