మా ఎన్నికలపై నిర్ణయం డీఆర్సీదే

టాలీవుడ్ నటీనటుల సంఘం 'మా' ఎగ్జిక్యూటివ్ బాడీ సమావేశం ఈ రోజు జరిగింది. క్రమశిక్షణ, రీకన్సిలియేషన్ కమిటీ చైర్మన్ కృష్ణం రాజుతో పాటు, మోహన్ బాబు, శివకృష్ణ, గిరిబాబు, మురళీ మోహన్ కూడా హాజరయ్యారు. …

టాలీవుడ్ నటీనటుల సంఘం 'మా' ఎగ్జిక్యూటివ్ బాడీ సమావేశం ఈ రోజు జరిగింది. క్రమశిక్షణ, రీకన్సిలియేషన్ కమిటీ చైర్మన్ కృష్ణం రాజుతో పాటు, మోహన్ బాబు, శివకృష్ణ, గిరిబాబు, మురళీ మోహన్ కూడా హాజరయ్యారు. 

ప్రస్తుత కార్యవర్గ సభ్యులు, అధ్యక్షుడు నరేష్, కార్యదర్శి జీవిత కూడా పాల్గొన్నారు. వెంటనే ఎన్నికలు జరిపించాలని కొందరు, అలా కాదు ఇలా అని మరి కొందరు సమావేశంలో సూచనలు చేసారు. 

ఆఖరికి మరి కొద్ది రోజుల్లో కృష్ణం రాజు సారథ్యంలోని డీఆర్సీ కమిటీ సమావేశమై ఏ నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయానికి కట్టుబడాలని తీర్మానించారు. డీఆర్సీ నిర్ణయం మేరకు ఆగస్టులో సర్వ సభ్య సమావేశం నిర్వహించాలని తీర్మానించారు.  

ఎన్నికల నిర్ణయం, డీఆర్సీ సూచనలు సర్వ సభ్య సమావేశానికి వదిలిపెట్టాలని నిర్ణయించారు. అంటే బంతి ఇప్పడు డిఆర్సీకి అక్కడి నుంచి జనరల్ బాడీకి చేరుకుంది. థర్డ్ వేవ్ లేకుంటే, అలాగే కేంద్రం గైడ్ లైన్స్ మారితే అప్పుడు ఎన్నికలు జరిపే అవకాశం వుంది. లేదూ అంటే ఈ వ్యవహారం ఇలా కొనసాగుతూనే వుంటుంది.