‘మా’ ఓటుకు పదివేలు

దిగజారిన వ్యవస్థ గురించి రిపబ్లిక్ లాంటి సినిమా వచ్చిందీ టాలీవుడ్ నుంచే. అలాంటి టాలీవుడ్ లోనే ఓటును అమ్మేసుకుంటున్నారు.  Advertisement రూపాయి, రెండు కు కాదు, ఏకంగా పదివేల రూపాయలకు. మా అసోసియేషన్లో పాపం,…

దిగజారిన వ్యవస్థ గురించి రిపబ్లిక్ లాంటి సినిమా వచ్చిందీ టాలీవుడ్ నుంచే. అలాంటి టాలీవుడ్ లోనే ఓటును అమ్మేసుకుంటున్నారు. 

రూపాయి, రెండు కు కాదు, ఏకంగా పదివేల రూపాయలకు. మా అసోసియేషన్లో పాపం, నెల ఖర్చుకు డబ్బులు లేక అల్లల్లాడుతున్నవారు చాలా మందే వున్నారు. ఇలాంటి వారి ఓట్లే గెలుపు సోపానాలు అవుతున్నాయి.

మంచు విష్ణు, ప్రకాష్ రాజ్ ప్యానెళ్లు ఢీ అంటే ఢీ అంటూ పోటీ పడుతున్నాయి. గెలుపు అన్నది ప్రతిష్టాత్మకం అయిపోయిది రెండు ప్యానళ్లకు. ఇలాంటి నేపథ్యంలో ప్యానెళ్లలో వివిధ పదవులకు పోటీ చేస్తున్న వారికి కూడా గెలుపు అన్నది కీలకం అయింది. 

దాంతో ఓటుకు నోటు అనే కార్యక్రమానికి తెరలేచినట్లు తెలుస్తోంది. ఈ వర్గమా..ఆ వర్గమా అన్నది తెలియదు కానీ, ఓటుకు పది వేలు వంతున పలుకుతోందని తెలుస్తోంది. ఇప్పటికే చాలా మందికి డబ్బులు అందేసాయని కూడా తెలుస్తోంది.

తమకు ఓటేయాలని అడిగితే, అవతలి వారు పదివేలు ఇచ్చారని, మాట ఇచ్చామని కొందరు ఓటర్లు చెబుతున్నట్లు తెలుస్తోంది. మొత్తం 900 ఓట్లలో మహా అయితే 500 పోల్ అవుతాయేమో? ఈ అయిదు వందల ఓట్లలో ఒక 150 వరకు ఇలా నోటు అందుకునే ఓట్లు వుంటాయని ఓ అంచనా.