ఇండస్ట్రీ నుంచి తప్పుకున్న ప్రతి హీరోయిన్ వెనక ఓ కథ ఉంటుంది. అందరూ కాస్టింగ్ కౌచ్ బాధితులు ఉండరు. ఎవరి వ్యక్తిగత కారణాలు వాళ్లకు ఉంటాయి. ఒకప్పటి స్టార్ హీరోయిన్ మధుబాలకు కూడా అలాంటి ఓ కారణం ఉంది.
“అందరు హీరోయిన్లలానే నాక్కూడా చాలా ఆఫర్లు వచ్చాయి. అయితే అన్ని పాత్రలూ ఒకటే. మంచి పాటలు ఉండేవి, కొన్ని రొమాంటిక్ సీన్స్ ఉండేవి. అంతవరకే. టాలెంట్ చూపిద్దామంటే ఒక్కటంటే ఒక్క సీన్ కూడా లేని సినిమాలు చాలానే చేశా. ఇలాంటి ఫేజ్ లో కూడా మంచి కంటెంట్ ఉన్న సినిమాల్లో నటించే అవకాశం నాకు దక్కింది.”
అలా కంటెంట్ ఉన్న సినిమాల కోసం ఎదురుచూస్తూనే రొటీన్ పాత్రలు చాలా చేసేశానంటోంది మధుబాల. దీంతో ఎక్కడో ఒక దగ్గర వీటికి ఫుల్ స్టాప్ పెట్టాలని నిర్ణయించుకుందట. మనసు చంపుకొని గ్లామర్ పాత్రలు పోషించే కంటే, పరిశ్రమ నుంచి తప్పుకోవడం మంచిదని భావించి, స్వచ్ఛందంగా సైడ్ అయిపోయానంటోంది మధుబాల.
అలా లైఫ్ లో సెటిలై, లాంగ్ గ్యాప్ తీసుకొని ఇప్పుడు మళ్లీ క్యారెక్టర్ రోల్స్ తో ప్రేక్షకుల ముందుకొచ్చింది అలనాటి ఈ బ్యూటీ. అయితే రీఎంట్రీలో ఆమె పెద్దగా ఆకట్టుకోలేకపోతోంది. తాజాగా శాకుంతలం సినిమాలో కూడా ఓ కీలక పాత్ర పోషించింది.