శ్రీ‌రెడ్డి బాట‌లో మ‌రో హీరోయిన్‌

న‌టి శ్రీ‌రెడ్డి బాట‌లో మ‌రో హీరోయిన్ న‌డుస్తోంది. అది న్యాయ బాట‌. ఇంత‌కూ శ్రీ‌రెడ్డి మార్గంలో ప్ర‌యాణించే హీరోయిన్ ఎవ‌ర‌నే క‌దా మీ ప్ర‌శ్న‌. అది తెలుసుకోడానికే ఈ క‌థ‌నం చ‌దువుదాం. క్యాస్టింగ్ కౌచ్…

న‌టి శ్రీ‌రెడ్డి బాట‌లో మ‌రో హీరోయిన్ న‌డుస్తోంది. అది న్యాయ బాట‌. ఇంత‌కూ శ్రీ‌రెడ్డి మార్గంలో ప్ర‌యాణించే హీరోయిన్ ఎవ‌ర‌నే క‌దా మీ ప్ర‌శ్న‌. అది తెలుసుకోడానికే ఈ క‌థ‌నం చ‌దువుదాం. క్యాస్టింగ్ కౌచ్ వివాదం నేప‌థ్యంలో తెర‌పైకి వ‌చ్చిన న‌టి శ్రీ‌రెడ్డి. అర్ధ‌న‌గ్నంగా హైద‌రాబాద్‌లో న‌డిరోడ్డుపై కూచొని నిర‌స‌న వ్య‌క్తం చేశారు. చిత్ర ప‌రిశ్ర‌మ‌లో అవ‌కాశాల పేరుతో మ‌హిళ‌ల‌ను లైంగికంగా లోబ‌ర‌చుకుంటున్న తీరుపై ఆమె గ‌ళ‌మెత్తారు. ఇటీవ‌ల‌ ఆమెపై రాకేష్ మాస్ట‌ర్ అనుచిత వ్యాఖ్య‌లు చేయ‌డం, ఆయ‌న‌కు శ్రీ‌రెడ్డి లీగ‌ల్ నోటీసులు పంపిన విష‌యాలు విధిత‌మే.

త‌న‌పై అనుచిత వ్యాఖ్య‌లు చేసిన రాకేష్ మాస్ట‌ర్‌పై హీరోయిన్‌, బీజేపీ నాయ‌కురాలు మాధ‌వీల‌త కూడా శ్రీ‌రెడ్డి మాదిరిగానే న్యాయ పోరాట మార్గం ప‌ట్ట‌నున్నారు. త‌న‌పై కొన్నిరోజులుగా అనుచిత వ్యాఖ్య‌లు చేస్తున్న రాకేష్ మాస్ట‌ర్‌పై మాధ‌వీల‌త ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. త‌న‌కెవ‌రో తెలియ‌ని రాకేష్, అత‌ని వ్యాఖ్య‌లు త‌న‌ను తీవ్ర మ‌నోవేధ‌న‌కు గురి చేశాయ‌న్నారు.

తనపై అసత్య ఆరోపణలు, అవాకులు చెవాకులు పేలినందుకు సోషల్‌ మీడియా వేదికగా క్షమాపణలు చెప్పాలని లేని పక్షంలో న్యాయపరంగా ముందుకు వెళ్తానన్నారు. ఎట్టి ప‌రిస్థితుల్లోనూ రాకేష్‌ను విడిచిపెట్టేది లేదని కోర్టు, పోలీస్‌ స్టేషన్‌ మెట్లు ఎక్కిం చేలా చేస్తానని ఆమె హెచ్చరించారు. ఈ విషయంపై ఇంత కంటే ఎక్కువగా మాట్లాడదల్చుకోలేదని, పరువునష్టం కేసు ద్వారానే అతడికి  సమాధానం చెప్పబోతున్నట్టు ఆమె వివరించారు. బీజేపీ ఎమ్మెల్సీ, న్యాయవాది రాంచంద్రరావు గైడెన్స్‌లో   ముం దుకు వెళ్లనున్న‌ట్లు  మాధవీలత తెలిపారు.

కాగా కొంత కాలంగా రాకేష్ సోష‌ల్ మీడియా వేదిక‌గా సినీ సెల‌బ్రిటీల‌పై సీరియ‌స్ కామెంట్స్ చేస్తున్నారు. వాటిలో కొన్ని వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లున్నాయి. రాకేష్ వివాదాస్ప‌ద కామెంట్స్  ఇండస్ట్రీ వర్గాల్లో  చర్చలకు దారి తీస్తున్నాయి. మ‌రీ ముఖ్యంగా మహిళా న‌టుల‌పై రాకేష్ కామెంట్స్ ర‌చ్చ‌కు దారి తీస్తున్నాయి. అవి కాస్తా కేసుల వ‌ర‌కు వెళుతున్నాయి.  ఇప్పటికే రాకేష్‌ మాస్టర్‌కు శ్రీరెడ్డి లీగల్‌ నోటీస్ పం పించగా తాజాగా మాధవీలత కూడా అదే మార్గంలో వెళ్లనుంది.

సరిగ్గా ఇక్కడే జగన్ సమయస్ఫూర్తితో అడుగు ముందుకేశారు