మాస్ట్రో…పక్కా ఇంట్రస్టింగ్

సాధారణంగా మాతృక చూసేసిన వారికి రీమేక్ మీద అంతగా ఆసక్తి వుండదు. ఒకవేళ వున్నా రీమేక్ కంటెంట్ చూసిన తరువాత పూర్తి శాటిస్ ఫాక్షన్ లభించడం కష్టం. మాస్త్రో ట్రయిలర్ చూస్తే మాత్రం రీమేక్…

సాధారణంగా మాతృక చూసేసిన వారికి రీమేక్ మీద అంతగా ఆసక్తి వుండదు. ఒకవేళ వున్నా రీమేక్ కంటెంట్ చూసిన తరువాత పూర్తి శాటిస్ ఫాక్షన్ లభించడం కష్టం. మాస్త్రో ట్రయిలర్ చూస్తే మాత్రం రీమేక్ అనీ, మాతృక చూసేసామనే ఫీలింగ్ కలుగదు.

ఓ ఫ్రెష్ సినిమాగా రూపొందించడంలో దర్శకుడు మేర్లపాక గాంధీ పూర్తిగా సక్సెస్ అయ్యారనే చెప్పాలి. అంథాదూన్ సినిమా ఆధారంగా తయారైన మాస్ట్రోలో హీరో కన్నా విలన్ షేడ్ వున్న ఫిమేల్ పాత్రనే కీలకం. ఈ పాత్రను తమన్నా బాగా చేసినట్లు ట్రయిలర్ చెప్పేస్తోంది.

నితిన్ ఓకె. థ్రిల్లింగ్ మూవ్ మెంట్స్  ను కాప్చర్ చేయడంలో దర్శకుడు తన చాకచక్యం బాగానే చూపించినట్లు అర్థం అయిపోతోంది. కొన్ని కట్స్ చూస్తుంటే మాతృకను యాజ్ ఇట్ ఈజ్ గా ఫాలో అయినట్లే వుంది. 

హీరో నితిన్ తన స్వంత బ్యానర్ మీద నిర్మించిన ఈ సినిమా డిస్నీ హాట్ స్టార్ లో విడుదల కాబోతోంది. నభానటేష్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాకు మహతి స్వరసాగర్ సంగీతం అందించారు.