మహేష్ సాంగ్ లీక్ ముందే వచ్చేసింది

మైత్రీ మూవీస్ నిర్మిస్తున్న సర్కారు వారి పాట సినిమాకు లీకుల బెడద తప్పడం లేదు. షూటింగ్ చిత్రాలు, టీజ‌ర్ బయటకు ముందే వచ్చేసాయి. ఇప్పుడు ఏకంగా ఓ పాట మొత్తం బయటకు వచ్చేసింది.  Advertisement…

మైత్రీ మూవీస్ నిర్మిస్తున్న సర్కారు వారి పాట సినిమాకు లీకుల బెడద తప్పడం లేదు. షూటింగ్ చిత్రాలు, టీజ‌ర్ బయటకు ముందే వచ్చేసాయి. ఇప్పుడు ఏకంగా ఓ పాట మొత్తం బయటకు వచ్చేసింది. 

ఈ నెల 14న ప్రతిష్టాత్మకంగా విడుదల చేయాలనుకున్న తొలి పాట వీడియో మొత్తం ఈ రోజు లీక్ అయిపోయింది. థమన్ ప్రత్యేకంగా పాట కోసం లిరికల్ వీడియో చేయించారు. ఈ వీడియో చాలా కలర్ ఫుల్ గా వుంది. ఇందులో పాట విజువల్స్ కూడా మిక్స్ చేసారు. 

మాంచి కలర్ స్కీమ్ తో, టోటల్ వీడియో చాలా బాగుంది. లిరికల్ వీడియో చేయించడంలోనో, మరెక్కడో లీకయిందని యూనిట్ భావిస్తోందని తెలుస్తోంది.

కావాలనే ఎవరో లీక్ చేస్తున్నారని, మహేష్ పాటకు రికార్డులు రాకుండా చేయడమే దీని ఉద్దేశమని కొందరు అంటున్నారు. సర్కారు వారి పాటను ముందు నుంచీ టార్గెట్ చేసారని టాక్ నడుస్తోంది.