సూపర్ స్టార్ మహేశ్ బాబు గ్యారేజీలోకి మరో ఖరీదైన కారు వచ్చి చేరినట్లు తెలుస్తోంది. మహేశ్ బాబు తాజాగా గోల్డ్ కలర్ రేంజ్ రోవర్ యస్వీ లేటెస్ట్ వెర్షన్ కారును కొనుగోలు చేశారు.. కారు ఖరీదు అక్షరాలా రూ. 5.4 కోట్లని తెలుస్తోంది. హైదరాబాద్లో గోల్డ్ కలర్ రేంజ్ రోవర్ ఇదే మొదటిదని తెలుస్తోంది.
టాలీవుడ్ లో ఇప్పటికే మోగాస్టార్ చిరంజీవి, జూనియర్ ఎన్టీఆర్, ప్రభాస్ ఈ కారును తీసుకున్నారు. లేటెస్ట్ గా రేంజ్ రోవర్ కొనుగోలు చేసిన హీరోల లిస్టులో సూపర్ స్టార్ మహేశ్ బాబు చేరారు. ఇప్పటికే మహేశ్ కారు హైదరాబాద్ రోడ్లపై తిరిగిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి.
మహేశ్ సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం ఆయన త్రివిక్రమ్ డైరెక్షన్ లో గుంటూరు కారం సినిమా చేస్తున్నారు. పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తుండగా థమన్ మ్యూజిక్ అందిస్తున్నారు. వచ్చే సంక్రాంతికి ఈ సినిమాను రిలీజ్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు. ఈ సినిమా తర్వాత రాజమౌళితో యాక్షన్ అడ్వెంచర్ సినిమా చేయనున్నారు.