ఇదిగో అదిగో అంటూ మీనం మేషం లెక్క పెడుతూ, ముందుకో అడుగు, వెనక్కో అడుగు వేస్తూ ఆఖరికి అన్నీ ఫైనల్ చేసుకుని షూటింగ్ దిశగా వెళ్తోంది మహేష్ బాబు-త్రివిక్రమ్ సినిమా.
ఇప్పటికే చాలా ఆలస్యం అయిపోయింది. పైగా వెనుక రాజమౌళి సినిమా తరుముతోంది. అందుకే ఈ సినిమాను చాలా అంటే చాలా ఫాస్ట్ గా పూర్తి చేయాలని డిసైడ్ అయ్యారు. జనవరి సెకెండ్ వీక్ ఆరంభంలో ప్రారంభించి ఎకాఎకిన మార్చి నెలాఖరు వరకు సింగిల్ షెడ్యూలులో సినిమాను పూర్తి చేయాలని ప్లాన్ చేస్తున్నారు.
నిజానికి సంక్రాంతి తరువాత ప్రారంభించాలి అనుకున్నారు. కానీ సినీ వర్కర్స్ కు సంక్రాంతి ఒక్క రోజే సెలవు. అందువల్ల సంక్రాంతికి కి చాలా మందుగానే ప్రారంభించి, ఆ ఒక్క రోజూ బ్రేక్ తీసుకుని షూటింగ్ కొనసాగించాలని అనుకుంటున్నారు. చిన్న చిన్న బ్రేక్ లు మినహా మార్చి నెలాఖరు వరకు ఒకే లెంగ్తీ షెడ్యూలు చేస్తారు. బహుశా మహేష్ ఇలా కంటిన్యూగా ఇంత లెంగ్తీ షెడ్యూలు చేయడం ఇదే తొలిసారి కావచ్చు.
జనవరి రెండోవారం నుంచి మార్చి చివరి వరకు అంటే దాదాపు 80 రోజులు. వీటిలో చిన్న చిన్న బ్రేక్స్, ఆదివారాలు వదిలేసినా 60 రోజులు కంటిన్యూ షూట్ వస్తుంది. అంటే మార్చి నెలాఖరుకు మహేష్-త్రివిక్రమ్ సినిమా దాదాపు 60 శాతానికి పైగా పూర్తయిపోయే అవకాశం వుంది. పూజా హెగ్డే, శ్రీలీల, శోభన ప్రస్తుతానికి ఎంపికైన తారాగణం. రామ్ లక్ష్మణ్ లు ఫైట్ మాస్టర్లు.