మహేష్ సినిమా అంకెలు…అధరహో!

కొన్ని ఏళ్ల తరువాత దర్శకుడు త్రివిక్రమ్-హీరో మహేష్ కాంబినేషన్ సినిమా స్టార్ట్ అయింది. ఈ సినిమా మార్కెట్ డీల్స్ ఏవీ ఇంకా ఫైనల్ కాలేదు కానీ, డిష్కషన్లు జరుగుతున్నాయి. నిర్మాతలు కోట్ చేస్తున్న రేట్లు…

కొన్ని ఏళ్ల తరువాత దర్శకుడు త్రివిక్రమ్-హీరో మహేష్ కాంబినేషన్ సినిమా స్టార్ట్ అయింది. ఈ సినిమా మార్కెట్ డీల్స్ ఏవీ ఇంకా ఫైనల్ కాలేదు కానీ, డిష్కషన్లు జరుగుతున్నాయి. నిర్మాతలు కోట్ చేస్తున్న రేట్లు వింటుంటే కాస్త షాకింగ్ గానే వుంది. ప్రస్తుతానికి అయితే కేవలం తెలుగు వెర్షన్ నే రెడీ చేసే ఆలోచనలో వున్నారు. విడుదల టైమ్ ను బట్టి హిందీ వెర్షన్ అన్నది వుంటుంది. కానీ వివిధ హక్కుల కోసం నిర్మాతలు కోట్ చేస్తున్నారని వినిపిస్తున్న అంకెలు మాత్రం కొంచెం షాకింగ్ గానే వున్నాయి.

ఓవర్ సీస్ రైట్స్ కోసం నిర్మాతలు కోట్ చేస్తున్నది 23 కోట్లు. ఇంత వస్తుందా? రాదా? ఇస్తారా? ఇవ్వరా? ఇస్తే ఎంత వరకు రావచ్చు అన్నది పక్కన పెడితే నిర్మాతలు ఈ మేరకు కోట్ చేస్తున్నారని వినిపిస్తోంది.

కేవలం దక్షిణాది నాలుగు రాష్ట్రాల డిజిటల్ రైట్స్ కు కోట్ చేస్తున్నది 100 కోట్లు. అక్షరాలా వంద కోట్లు. టాప్ ఓటిటి సంస్థ ప్రతినిధులతో ఈ మేరకు డిస్కషన్లు సాగుతున్నాయి. అంత ఇస్తారా? అందులో సగమే ఇస్తారా? లేక మరి కొంచెం ఇస్తారా? అన్నది తరువాత సంగతి. ప్రస్తుతానికి కోట్ చేసింది అయితే అదీ ఫిగర్.

ఇక హిందీ డబ్బింగ్..డిజిటల్ రైట్స్ ను మాత్రం ఇంకా బేరం పెట్టలేదు. ఎందుకంటే హిందీ వెర్షన్ విడుదల వుంటుందా? వుండదా? అన్నది డిసైడ్ అయిన తరువాత మాత్రమే ఆ లెక్క తేలుతుంది. హిందీ వెర్షన్ విడుదల లేకుండా వుంటే కనుక ఈ మొత్తం ముఫై కోట్ల రేంజ్ లో వుంటుందని వినిపిస్తోంది.

అలవైకుంఠపురంలో తరువాత అడియో రైట్స్ భయంకరంగా పెరిగాయి. భీమ్లా నాయక్ కే అయిదు కోట్లకుపైగా వసూలు చేసారు. మరి ఈ సినిమాకు అంతకన్నా ఎక్కువే కోట్ చేసే అవకాశం వుంది.

ఇక థియేటర్ హక్కుల విషయానికి వస్తే నైజాం ఏరియా 45 కోట్ల రేంజ్ లో వుంటుందట. ఎందుకంటే అలవైకుంఠపురములో సినిమా అన్నీ పోను 42 కోట్లు వసూలు చేసింది. నైజాం కనుక ఈ రేంజ్ లో వుంటే ఆంధ్ర 50 కోట్ల రేంజ్ లో సీడెడ్ 20 కోట్ల రేంజ్ లో లెక్క తేలుతుంది.

మొత్తం నిర్మాతలు ఆశిస్తున్నట్లు ఇవన్నీ ఫిక్స్ అయితే 140 కోట్ల వరకు థియేటర్ మీద, మరో అంత మొత్తం నాన్ థియేటర్ మీద మరో 140 కోట్ల వరకు రావాల్సి వుంటుంది. అంటే 280 కోట్లు. ఇందులో బేరాలు..సారాలు వుంటాయి అనుకున్నా…250 కోట్ల మేరకు మార్కెట్ వుంటుందనుకోవాలి.

సినిమా ఖర్చు కూడా ఆ రేంజ్ లోనే వుంటుంది. మహేష్ పారితోషికమే జిఎస్టీతో కలిపి 70 కోట్లు అని వినిపిస్తోంది.