శృంగారం విషయంలో శతాబ్దాల కిందటే ప్రపంచానికి గైడ్ ను అందించిన దేశం మనది. దేవాలయాలపై శృంగార శిల్పాలను చెక్కి కళాతృష్ణను తీర్చుకున్న దేశం మనది. దేవతల శృంగార లీలలను కూడా కీర్తనలుగా అల్లుకున్న నేపథ్యం మనది. అయితే ఇండియాలో శృంగారం గురించి మాట్లాడటం అంత తేలికైన అంశం కాదు. శృంగారం గురించి చర్చ అనేది బాగా వివక్షతో కూడుకున్న అంశం. దీనిపై ఓపెన్ గా మాట్లాడటం సంగతలా ఉంచితే, చర్చకు కూడా ఇష్టపడని సమాజం మనది.
శృంగారం అత్యంత సహజమైనదే అని అందరికీ తెలిసినా.. దీనిపై చర్చకు ఇష్టపడని సమాజం మనది. ఇక ఇదే సొసైటీలో జాయింట్ ఫ్యామిలీలు, వర్క్ ఫ్రమ్ హోం కల్చర్ లలో శృంగారం కూడా బాగా ప్రభావితం అవుతున్న అంశం కావడం గమనార్హం. వర్క్ ఫ్రమ్ హోం ల వల్ల చాలా మంది సిటీలను వదిలి సుదీర్ఘకాలంగా పల్లెల్లోనూ, సొంతూళ్లలోనూ గడుపుతూ ఉంటారు. ఈ విషయంలో తమ స్నేహితులతో చర్చల్లోనూ, బాగా సన్నిహితులైన వాళ్లతో మాటల్లోనే.. పెద్ద వాళ్లతో కలిసి ఉండటం వల్ల, సొంతవాళ్ల మధ్యన తమ శృంగార జీవితం ప్రభావితం అవుతున్న తీరు గురించి కూడా వారు చర్చించుకునే పరిస్థితి వచ్చింది.
తన భర్త మిట్ట మధ్యాహ్నం ఇంట్లో అంతా ఉండగా.. బెడ్రూమ్ కు పిలిచి లోపల నుంచి గడియపెడతాడని.. బయట అంతా ఉండగా వారంతా గమనిస్తూ ఉండగా.. భర్త వ్యవహరించే తీరు తనకు బాగా ఇబ్బందికరంగా ఉంటుందని ఒక అతివ చెప్పుకునే పరిస్థితి ఉంటుంది.
తాము సెక్స్ లో చాలా ఫ్రీగా ఉండేవాళ్లమని.. ఇప్పుడు రాత్రిపూట అయినా బయటకు శబ్దం వస్తుందేమో అనే సందేహాన్ని మనసులో పెట్టుకుంటూ శృంగారం విషయంలో చాలా భయంభయంగా వ్యవహరించాల్సి వస్తోందని మరొకరు మొరపెట్టుకునే పరిస్థితి ఉంది.
మరి ఈ అంశం గురించి రిలేషన్ షిప్ ఎక్స్ పర్ట్స్ పలు సలహాలు ఇస్తారు. ఎవరికైనా ఇది ఇబ్బందికరమైన పరిస్థితే మన సమాజంలో. ఈ పరిస్థితి నివారించడానికి చిన్న చిన్న టెక్నిక్స్ ఉంటాయంటారు. శృంగార స్పందనలకు సంబంధించిన సౌండ్స్ ఏమైనా బయటకు వినిపిస్తాయనుకుంటే.. బెడ్రూమ్ లో టీవీ సౌండ్ కాస్త పెంచుకోవచ్చని చిన్న సలహా ఇస్తున్నారు రిలేషన్షిప్ కౌన్సెలర్లు.
ఇంట్లోనే డిఫరెంట్ స్పాట్ ను కనుక్కోవచ్చని చెబుతున్నారు! అయితే అక్కడ అది మరింత ఇబ్బందికరం మాత్రం కాకూడదు. ఏ బాత్రూమ్ లో యధేచ్ఛగా గడపడానికి అవకాశంగా మలుచుకోవచ్చనేది సినిమాల్లో కూడా చూపించే సలహా!
వీలైతే వీకెండ్ బయటకు ప్లాన్ చేసుకోవడం మరో ఉత్తమమైన మార్గం. ఇంట్లో గడపలేనంత ఇబ్బంది ఉంటే.. అందుకు అనుకూలమైన స్పాట్ ను ఎంచుకోవచ్చు.
బెడ్ సౌండ్ వస్తుందనుకుంటే ఫ్లోర్ అనుకూలమైనదని, టీవీ ని బ్యాక్ గ్రౌండ్ సౌండ్ గా వాడుకోవడం తెలివైన మార్గాలంటున్నారు. మరి ఈ తెలివితేటలుండే వారికి ఇబ్బంది లేనట్టే. ఇబ్బంది పడే వారికి రిలేషన్ షిప్ ఎక్స్ పర్ట్స్ ఇచ్చే సూచనలివి!