మహేష్ అభిమానుల్లో అసహనం

ఇదిగో షూటింగ్ అనేలోపు.. అదిగో ఆగిపోయిందనే ప్రచారం. మహేష్ మూవీకి సంబంధించిన మేటర్ ఇది. ఈ సినిమా స్టార్ట్ అవ్వడమే జీవితకాలం లేటు. సెట్స్ పైకి వచ్చిన తర్వాత కూడా ఎప్పటికప్పుడు అవాంతరాలు. ఫస్ట్…

ఇదిగో షూటింగ్ అనేలోపు.. అదిగో ఆగిపోయిందనే ప్రచారం. మహేష్ మూవీకి సంబంధించిన మేటర్ ఇది. ఈ సినిమా స్టార్ట్ అవ్వడమే జీవితకాలం లేటు. సెట్స్ పైకి వచ్చిన తర్వాత కూడా ఎప్పటికప్పుడు అవాంతరాలు. ఫస్ట్ లుక్ వచ్చిందని పండగ చేసుకునేలోపే, షూటింగ్ ఆగిపోయిందంటూ న్యూస్. దీంతో మహేష్ అభిమానులు అసహనంతో ఉన్నారు.

ఇప్పుడు కూడా ఇదే పరిస్థితి. ఈ సినిమా టైటిల్ రిలీజ్ అవుతుందా, టీజర్ వస్తుందా అని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న టైమ్ లో షూటింగ్ ఆగిపోయింది, కొన్ని సీన్స్ చెత్త బుట్టలో పడేశారంటూ వస్తున్న వార్తలు ఫ్యాన్స్ ను కలవరపాటుకు గురి చేస్తున్నాయి.

సరే.. షూటింగ్ ఎప్పుడు జరిగితే ఏంటి, సినిమా అనుకున్న టైమ్ కు వస్తుంది కదా అది చాలు అనుకున్నారు. తాజాగా ఆ ఆనందం కూడా ఆవిరైంది. ఈ సినిమా వచ్చే ఏడాదికి వాయిదా పడింది. దీంతో ఫ్యాన్స్ ఉసూరుమంటున్నారు. ఈ ఏడాది మహేష్ మూవీ థియేటర్లలోకి రాదనే ఆలోచననే ఫ్యాన్స్ భరించలేకపోతున్నారు.

మరోవైపు ఇతర హీరోల ఫ్యాన్స్ చేస్తున్న ట్రోలింగ్ తో మహేష్ అభిమానులు మరింత ఉక్కిరిబిక్కిరవుతున్నారు. అభిమానుల్లో ఉన్న ఈ అసహనాన్ని చల్లార్చాలంటే ఒకటే మార్గం. ఫస్ట్ లుక్ రిలీజ్ చేసి ఎలాగైతే అందర్లో ఉత్సాహం నింపారో, ఈసారి టైటిల్ లేదా టీజర్ లాంటి చిన్న వీడియో రిలీజ్ చేయాలి.

దానికి ఇంకా నెల రోజులు టైమ్ ఉంది. అప్పటివరకు ఈ అసహనం, ఆగ్రహ జ్వాలలు సోషల్ మీడియాలో రగులుతూనే ఉంటాయి, తప్పదు.