ఖుషి సినిమా నుంచి సెకెండ్ సింగిల్ రిలీజైంది. ఆ సాంగ్ ఎలా ఉందనేది ఇక్కడ అప్రస్తుతం. లిరికల్ వీడియోలో భాగంగా విడుదల చేసిన ఓ స్టిల్ మాత్రం కొందర్ని ఆకట్టుకుంది. మరీ ముఖ్యంగా మహేష్ బాబు ఫ్యాన్స్ ను అది బాగా ఎట్రాక్ట్ చేసింది. వెంటనే ఆ ఒక్క ఫొటోను క్రాప్ చేసి, సమంతను ట్రోల్ చేయడం మొదలుపెట్టారు మహేష్ ఫ్యాన్స్.
ఇంతకీ ఏంటి మేటర్..
ముందుగా ఆ ఫొటో సంగతి చూద్దాం. ఇప్పుడు మీరు చూస్తున్నదే ఆ ఫొటో. సోఫాలో విజయ్ దేవరకొండ పడుకొని ఉంటాడు. అతడి కాళ్ల దగ్గర సమంత కూర్చొని ఏదో రాసుకుంటుంది. అదే టైమ్ లో విజయ్ దేవరకొండ, తన ఎడమ కాలి బొటన వేలితో సమంతను గోకుతాడు. మాంటేజ్ సాంగ్ కాబట్టి, సినిమా కథకు ఈ స్టిల్ కు పెద్దగా సంబంధం ఉండకపోవచ్చు.
కానీ మహేష్ ఫ్యాన్స్ మాత్రం ఈ ఫొటోనే తెరపైకి తీసుకొచ్చారు. దీనికి ఓ కారణం ఉంది. కొన్నేళ్ల కిందట మహేష్ నటించిన వన్-నేనొక్కడినే అనే సినిమాలోని ఓ పోస్టర్ పై సమంత అభ్యంతరం వ్యక్తం చేసింది. ఆ పోస్టర్ లో మహేష్ బీచ్ లో నడుస్తుంటే, అతడి కాలి ముద్రలపై హీరోయిన్ పాకుతున్నట్టు చూపించారు. అది కూడా మాంటేజ్ సాంగ్ లో భాగంగా వచ్చిన ఫొటోనే.
వివాదాస్పదమైన ఫొటో..
కాకపోతే ఆ ఫొటో చూసి సమంత హర్ట్ అయింది. ఆ పోస్టర్ చూసి నా మనోభావాలు ఘోరంగా దెబ్బతిన్నాయంటూ పరోక్షంగా కామెంట్ చేసింది. అప్పట్లోనే దీనిపై చాలా దుమారం చెలరేగింది. మళ్లీ ఇన్నాళ్లకు సమంత ఇలా దొరికిపోయింది.
అప్పుడు మహేష్ బాబు పోస్టర్ పై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసిన సమంత, ఇప్పుడు విజయ్ దేవరకొండ కాళ్ల దగ్గర కూర్చుందని, అతడు కాలితో తడుముతుంటే మనోభావాలు దెబ్బతినలేదా అని ప్రశ్నిస్తున్నారు. ఇప్పుడిప్పుడే రాజుకుంటున్న ఈ వివాదం ఏ మలుపు తీసుకుంటుందో చూడాలి.