మహేష్ బాబు-కీర్తి సురేష్ ల సర్కారు వారి పాట మూవీ నుంచి రెండో సాంగ్ విడుదలయింది. హీరో ఇంట్రడ్యూసింగ్ సాంగ్ లా వుంది ఇది. బ్యాంక్ మొండి బాకీలు ముక్కు పిండి వసూలు చేసే క్యారెక్టర్ ఓ సాంగేసుకుంటే ఎలా వుంటుందో అలా రాసారు రచయిత అనంత్ శ్రీరామ్. వెస్ట్రన్ బీట్ ప్లస్ ర్యాప్ స్టయిల్ ఙోడించి తయారు చేసిన సాంగ్ ఇది.
సంగీత దర్శకుడు థమన్ ఎప్పటి మాదిరిగానే కవర్ విడియో తయారు చేసారు. మ్యూఙిక్ టీమ్, సాంగ్ విడియో బిట్స్ తో పాటు మహేష్ ముద్దుల తనయ సితార డ్యాన్స్ ఈ కవర్ సాంగ్ కు అడిషినల్ అట్రాక్షన్. నిన్ననే ఈ కవర్ విడియో టీఙర్ విడుదల చేసారు. దానికి ఎక్స్ టెన్షన్ ఇది. సితార డ్యాన్స్ మూవ్ మెంట్స్ బాగున్నాయి.
పాట అంత క్యాచీగా లేదు. సినిమాలో ఎలా వుంటుందో చూడాలి. థమన్ ఈ మధ్య మంచి ట్యూన్ లు ఇస్తున్నారు. కానీ ఈ ట్యూన్ మాత్రం ఆ మార్క్ మేరకు లేదనే చెప్పాలి. పైగా బ్యాంక్, మనీ భాష్ అంతా పాటలో చేరడంతో పాడుకోవడానికి కాస్త దూరంగానే వుంటుంది.
మైత్రీ మూవీస్, 14 రీల్స్ సంస్థలు కలిసి నిర్మిస్తున్న ఈ సినిమాకు పరుశురామ్ దర్శకుడు.