ప్రతి హీరోకి విభిన్నమైన సినిమాలు చేయాలని వుంటుంది. కానీ ప్రేక్షకులు ఒక్కో హీరోని ఒక్కో స్టయిల్ లోనే ఎక్కువగా చూడాలనుకుంటారు. హీరో నానికి కూడా ఇలాంటి కోరికే వుంది. మాంచి మాస్ సినిమాలు, మాస్ క్యారెక్టర్లు చేయాలని. అవకాశం దొరికినపుడల్లా ఇలాంటివి ట్రయ్ చేస్తూనే వున్నాడు.
సక్సెస్, ఫెయిల్యూర్ లతో సంబంధం లేకుండా. ఈసారి మాస్ ను మించి ఊరమాస్ పాత్రను చేస్తున్నట్లు కనిపిస్తోంది. దసరా పేరుతో నిర్మాత సుధాకర్ నిర్మిస్తున్న సినిమాలో హీరో నాని ఫస్ట్ లుక్ ను బయటకు విడుదల చేసారు.
సింగరేణి బ్యాక్ డ్రాప్ లో తయారవుతున్న ఈ సినిమాలో నాని లుక్, గెటప్, దాన్ని ప్రఙెంట్ చేసి తీరు అన్నీ పక్కా ఊరమాసు లెక్కలే అన్నట్లుగా వున్నాయి. ఓదెల శ్రీకాంత్ డైరక్షన్ లో తయారవుతున్న దసరా సినిమాకు థమన్ సంగీతం అందిస్తున్నారు.
ఈ ఇంట్రడ్యూసింగ్ చిన్న విడియోకి సంతోష్ నారాయణ్ ఇచ్చిన ఆర్ఆర్ అతని లెవెల్ లోనే వుంది. లుంగీ, మాసిన బనియన్, షర్ట్ తో నాని ఎంత మాసీగా వున్నాడో, ఈ ఆర్ఆర్ కూడా అంత మాసీగానూ వుంది. శ్యామ్ సింగ రాయ్ సక్సెస్ తరువాత నాని చేస్తున్న సినిమా ఇది.