పుష్పరాజ్ కు మామగారి పార్టీ

పుష్ప రాజ్ క్యారెక్టర్ తో పాన్ ఇండియా హీరో అయిపోయాడు బన్నీ. హిందీ బెల్ట్ లో భయంకరంగా కలెక్షన్లు కొల్లకొట్టింది సినిమా. ఇప్పుడు పుష్ప 2 అనే అత్యంత భారీ పాన్ ఇండియా మీద…

పుష్ప రాజ్ క్యారెక్టర్ తో పాన్ ఇండియా హీరో అయిపోయాడు బన్నీ. హిందీ బెల్ట్ లో భయంకరంగా కలెక్షన్లు కొల్లకొట్టింది సినిమా. ఇప్పుడు పుష్ప 2 అనే అత్యంత భారీ పాన్ ఇండియా మీద దృష్టి పెట్టి వున్నాడు బన్నీ. దాదాపు 250 నుంచి 300 కోట్ల రేంజ్ లో తయారు కాబోతోందీ సినిమా.

ఇలాంటి నేపథ్యంలో బన్నీ సక్సెస్ సెలబ్రేషన్ అంటూ ఓ మాంచి పార్టీ హోస్ట్ చేసారు పార్క్ హయాత్ హొటల్ లో. బన్నీకి పార్టీలు కొత్త కాదు. సక్సెస్ లూ కొత్త కాదు. కానీ ఈ పార్టీ ఇచ్చింది నిర్మాతలో, దర్శకుడో, సినిమా జ‌నాలో కాదు. 

బన్నీకి పిల్ల నిచ్చిన స్వంత మామగారు. ఆయన ఇప్పటి వరకు సినిమా జ‌నాలకు, సినిమా ఫంక్షన్లకు పరిచయం తక్కువ. తొలిసారి ఇలాంటి పార్టీ ఇచ్చారు ఆయన. ఆయనే స్వయంగా సినిమా జ‌నాలను ఆహ్వానించడం విశేషం.

సినిమా రంగానికి చెందిన పలువురు ప్రముఖ నిర్మాతలు, దర్శకులు, పుష్ప సినిమా యూనిట్ కొందరు రాజ‌కీయ నాయకులు ఈ ఫంక్షన్ కు హాజ‌రయ్యారు. బన్నీతో ఫొటో సెషన్ లతో పార్టీ హడావుడిగా నడిచింది. మెగాస్టార్ చిరంఙీవి స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచారు.

9 Replies to “పుష్పరాజ్ కు మామగారి పార్టీ”

Comments are closed.