Advertisement

Advertisement


Home > Movies - Movie News

మహేష్ లుక్: కాపీ కొట్టారా.. కొత్తగా ట్రై చేశారా?

మహేష్ లుక్: కాపీ కొట్టారా.. కొత్తగా ట్రై చేశారా?

మహేష్ బాబుని ఇంకెవరూ మార్చలేరోమో, అసలు మహేష్ లుక్ లో మార్పు రాదేమో అనుకుంటున్న టైమ్ లో పరశురామ్ కాస్త గట్టిగానే మహేష్ లుక్ పై వర్కవుట్ చేసినట్టుంది. అందుకే సర్కారువారి పాట ఫస్ట్ లుక్ పోస్టర్ ఆకట్టుకునేలా ఉంది. ఎప్పటిలాగే షార్ట్ హెయిర్ కట్ లో కనిపించకుండా.. కాస్త రఫ్ లుక్ లో కనిపిస్తున్నాడు మహేష్. జులపాల జుట్టు హెయిర్ స్టైల్ లోకి మారిపోయారు. గడ్డం పెంచడం, ఇయర్ రింగ్, వన్ రూపీ కాయిన్ టాటూ కూడా సంథింగ్ స్పెషల్ అనిపిస్తోంది.

దూకుడు మూవీ హిట్ తర్వాత మహేష్ బాబు ఆ సినిమాలో అప్పియరెన్స్ కి బలంగా ఫిక్స్ అయిపోయాడు. స్పైక్స్ తో షార్ట్ గా కనిపించే హెయిర్ స్టైల్, లైట్ బియర్డ్ కి అలవాటు పడ్డాడు. ఏ సినిమా చేసినా, అందులో క్యారెక్టర్ ఏదైనా కథ మారింది కానీ, మహేష్ లుక్ మాత్రం మారలేదు. పోలీసైనా, చివరికి ఆర్మీ మేజర్ రోల్ అయినా లుక్ మార్చే సాహసం చేయలేదు మహేష్. జనాలు కూడా అలాగే యాక్సెప్ట్ చేశారు. ఇక ఇప్పుడు ఆ స్టైల్ అనివార్యంగా మారిపోయింది.

అయితే డైరక్టర్ పరశురామ్ మాత్రం ఈసారి కాస్త వెరైటీగా ట్రైచేయాలని గట్టిగా డిసైడ్ అయినట్టున్నాడు.. పరశురామ్ కెరీర్ చూస్తే, కథతో కసరత్తులు చేశారే కానీ ఇప్పటి వరకూ ఆయన చేసిన సినిమాల్లో హీరో లుక్స్ పై ప్రయోగాలెప్పుడూ చేయలేదు. సూపర్ హిట్టయిన గీతగోవిందంలో కూడా విజయ్ దేవరకొండ లుక్ పై ఆయన పెద్దగా ఫోకస్ పెట్టినట్టు కనిపించదు.

అలాంటి దర్శకుడు కాస్తా తొలిసారి మహేష్ బాబుని సరికొత్తగా ప్రజెంట్ చేయాలనుకుంటున్నాడు. అందుకే టైటిల్ దగ్గర్నుంచి, హీరో గెటప్ వరకు అన్నీ ఆకట్టుకునేలా డిజైన్ చేసుకున్నాడు. మొహం కనిపించకుండానే మహేష్ సైడ్ లుక్ తో క్యూరియాసిటీ పెంచాడంటే.. ఇక ఫుల్ ఫొటో పడితే బొమ్మ దద్దరిల్లిపోవడం ఖాయమంటున్నారు సూపర్ స్టార్ ఫ్యాన్స్.

అయితే దీనికి కౌంటర్ గా ఆల్రెడీ ఎన్టీఆర్ ఫ్యాన్స్ రంగంలోకి దిగిపోయారు. ఊసరవెల్లిలో తమ హీరో లుక్ ను బయటకు తీసి ట్రెండ్ చేయడం స్టార్ట్ చేశారు. అందులో కూడా సరిగ్గా ఇలానే మెడపై పచ్చబొట్టు వేసుకుంటాడు హీరో. టాటూ మాత్రమే కాదు.. అందులో ఎన్టీఆర్ చెవికి రింగ్ కూడా పెట్టుకుంటాడు. అప్పటి తారక్ లుక్ నే ఇప్పుడు మరోసారి అనుకరిస్తున్నారంటూ వాదిస్తున్నారు అతడి ఫ్యాన్స్. పరశురామ్ మాత్రం ఈసారి కొత్త మహేష్ బాబును చూస్తారని చెబుతున్నాడు.

నిజంగానే మహేష్ బాబును పరశురామ్ కొత్తగా చూపిస్తున్నాడా లేక ఊసరవెల్లిలో టోనీని గుర్తుచేస్తాడా అనేది త్వరలోనే తేలిపోతుంది.

పేద‌ల‌కు మంచి జ‌ర‌గ‌డం చంద్ర‌బాబుకు ఇష్టం లేదా?

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?