మహేష్-రాజమౌళి కాంబినేషన్ లో సినిమా ఇప్పటిది కాదు. ఇంకా చెప్పాలంటే బాహుబలి కంటే ముందే రావాల్సిన ప్రాజెక్టు ఇది. ఈ మేరకు అటు దర్శకుడు, ఇటు హీరో వద్ద అడ్వాన్సులు కూడా ఉన్నాయి. కానీ ఇద్దరూ తమతమ ప్రాజెక్టులతో బిజీగా ఉండడం వల్ల ప్రాజెక్ట్ సెట్ కాలేదు.
ఎట్టకేలకు మహేష్ తో మూవీకి రాజమౌళి రెడీ అయ్యాడు. ఆర్ఆర్ఆర్ తర్వాత మహేష్ తోనే సినిమా ఉంటుందని స్పష్టంచేశాడు. అటు మహేష్ కూడా సర్కారువారి పాట తర్వాత రాజమౌళితోనే సెట్స్ పైకి వెళ్లడానికి రెడీ అయ్యాడు. కానీ కరోనా/లాక్ డౌన్ వల్ల ఈ కాంబినేషన్ ఇంకాస్త ఆలస్యమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.
లాక్ డౌన్ వల్ల ఆర్ఆర్ఆర్ ప్రాజెక్టు బాగా లేట్ అయింది. రాజమౌళి ఇంకాస్త ఎక్స్ ట్రా టైమ్ కేటాయించాల్సిన పరిస్థితి వచ్చింది. దాదాపు వచ్చే ఏడాది వేసవి వరకు ఈ సినిమా షూటింగ్ తోనే సరిపోయేలా ఉంది. అటు మహేష్ మాత్రం సర్కారువారి పాట సినిమాను వీలైనంత తొందరగా పూర్తిచేయబోతున్నాడు. ఎందుకంటే అతడి కెరీర్ లో లాక్ డౌన్ వల్ల మళ్లీ గ్యాప్ వచ్చేసింది.
సో.. మహేష్ సర్కారువారి పాట పూర్తిచేసే సమయానికి రాజమౌళి అందుబాటులోకి వచ్చే పరిస్థితి కనిపించడం లేదు. కాబట్టి ఈ గ్యాప్ లో మరో దర్శకుడికి అవకాశం ఇవ్వాలని మహేష్ భావిస్తున్నాడు. ఆల్రెడీ మహేష్ లిస్ట్ లో కొంతమంది దర్శకులున్నారు. వాళ్లలో ఒకరికి అవకాశం దక్కవచ్చు..
నిజానికి ఈ లాక్ డౌన్ టైమ్ లో మహేష్ కోసం కొన్ని స్టోరీలైన్స్ కూడా ఫైనలైజ్ చేశాడు రాజమౌళి. కానీ అంతలోనే అనుకోకుండా కరోనా బారిన పడ్డాడు. ఇప్పుడు కరోనా నుంచి కోలుకున్నప్పటికీ తిరిగి ఆర్ఆర్ఆర్ పనులు మొదలుపెట్టే ప్లానింగ్ లో ఉన్నాడు. సో.. మహేష్-రాజమౌళి కాంబోలో సినిమా ఇంకాస్త ఆలస్యమయ్యేలా ఉంది.