పూజా హెగ్డే ను పక్కన పెట్టారు. మరి ఎవరు ఆ ప్లేస్ ను రీప్లేస్ చేస్తారు.. మహేష్-త్రివిక్రమ్ సినిమా సంగతే ఇది. ఆ చాన్స్ ను మీనాక్షి చౌదరి కొట్టేసింది.
ముందుగా అనుకున్న స్క్రిప్ట్ లో పూజా హెగ్డే మెయిన్ లీడ్. శ్రీలీల ది చిన్న పాత్ర. కానీ తరువాత శ్రీలీల క్రేజ్ కు అనుగుణంగా స్క్రిప్ట్ మారింది. రెండు పాటలతో శ్రీలీల పాత్ర పెద్దదయింది. దీంతో మెయిన్ లీడ్ పూజా పాత్ర తగ్గింది. కానీ అంతలోనే పూజ ను మార్చారు. ఆ ప్లేస్ లోకి మీనాక్షి చౌదరిని తీసుకుంటున్నారని వార్తలు వినిపిస్తున్నాయి.
టాలీవుడ్ కు మీనాక్షి పరిచయమే. హిట్ 2, ఇచ్చట వాహనములు నిలుపరాదు, అలాగే రవితేజ తో ఖిలాడీ సినిమాలు చేసిందీ అమ్మాయి. ఇప్పుడీ అమ్మాయి మహేష్ సరసన అది కూడా త్రివిక్రమ్ తో అంటే మంచి చాన్స్ కొట్టేసినట్లే. ఇప్పటికే తెలుగులో హీరోయిన్ల కొరత ఎక్కువగా వుంది. అందువల్ల ఈ మాత్రం అవకాశం ఇస్తే చాలు మీనాక్షి లాంటి వాళ్లు మంచి ప్రామిసింగ్ హీరోయిన్లుగా మారతారు.
త్రివిక్రమ్ హీరోయిన్ అంటే ఆయన తీసుకునే పాట్రన్ గమనిస్తే చీరకట్టులో బాగుండాలి. ఆ క్వాలిఫికేషన్ మీనాక్షికి వుంది. బహుశా అందుకే సెలక్ట్ అయిపోయి వుండాలి.