చిరకాలంగా ఓ వార్త. దర్శకుడు సందీప్ వంగా తీసిన ఆనిమల్ సినిమా కథ ను ముందుగా మహేష్ బాబు కు చెప్పారని, కానీ ఆయన నో అనడంతో బాలీవుడ్ కు వెళ్లారని ఆ వార్త సారాంశం. మహేష్ బాబు మంచి ప్రాజెక్ట్ వదులుకున్నాడని కామెంట్లు స్టార్ట్ అయ్యాయి.
అయితే దీనికి సందీప్ వంగా క్లారిటీ ఇచ్చారు. మహేష్ కు చెప్పిన కథ ఇది కాదని, డెవిల్ అనే మరో కథ అని వివరించారు. అది ఆనిమల్ కన్నా ఎక్కువ ఎమోషనల్ గా, ఎక్కువ ఇంటెన్సివ్ గా వుంటుందని వెల్లడించారు. ఆనిమల్ సినిమాను తెలుగులో తీయాల్సి వచ్చినా తన ఛాయిస్ మహేష్ నే అన్నారు.
రణబీర్ కపూర్ కు వున్న సహనం ఇంతా అంతా కాదని సందీప్ వంగా అన్నారు. ప్రభాస్ తో చేయబోయే సినిమా స్ట్రయిట్ గా తెలుగులోనే వుంటుందని, మిగిలిన భాషల్లో కూడా వస్తుందని వివరించారు. తన సినిమా ఇంత ఇంటెన్సివ్ గా, ఎమోషనల్ గా ఎలా తీయగలుగుతున్నాననే ప్రశ్నకు తనకే సమాధానం తెలియదని, మరి కొన్ని సినిమాల తరువాత తెలుస్తుందేమో అని వివరించారు.
ఇదే మీడియా మీట్ లో అనిల్ కపూర్ మాట్లాడుతూ, దర్శకుడు బాపు వల్లనే ఈ స్ధానంలో ఇలా వున్నానని, అది ఎప్పటికీ మరిచిపోనని అన్నారు. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ను కూడా ఎప్పటికీ మరిచిపోలేనన్నారు.