హీరో నితిన్ లేటెస్ట్ సినిమా ఎక్స్ ట్రార్డినరీ మాన్. ఈ సినిమా ట్రయిలర్ విడుదలయింది. కొత్త కథ అని కానీ, కొత్తగా తీసామని కానీ చెప్పే ప్రయత్నం పెద్దగా చేయలేదు.
జూనియర్ ఆర్టిస్ట్ గా నితిన్ కనిపించడం అన్నది కొత్త పాయింట్ నే. తండ్రీ కొడుకుల ఫన్నీ సీన్స్, హీరో ఫన్నీ సీన్స్ మామూలుగానే వున్నాయి. మరీ సూపర్ పంచ్ అనే రేంజ్ డైలాగులు ఏవీ పడలేదు కానీ, కథలో అసలు ట్విస్ట్ ఏదో వుందనే సూచన మాత్రం ట్రయిలర్ లో ఇచ్చారు.
కాస్త డెప్త్ వున్న మాస్ యాక్షన్ కథ ఏదో తయారు చేసుకుని ఈ సినిమాను చేసినట్లు ట్రయిలర్ మలి భాగం స్పష్టం చేస్తోంది. ఆ పార్ట్ గురించి ట్రయిలర్ లో ఎక్కువగా రివీల్ చేయలేదు. కానీ అదే సినిమాలో కాస్త కీలకంగా వుంటుందనే క్లారిటీ మాత్రం వుంది.
నితిన్ స్ట్రెంగ్త్ ఫన్ అండ్ ఎంటర్ టైన్ మెంట్. ఆ జానర్ ను టచ్ చేస్తూనే, కాస్త బలమైన మాస్ యాక్షన్ కథ ను దర్శకుడు వక్కంతం వంశీ రెడీ చేసుకున్నట్లు కనిపిస్తోంది. అందువల్ల సినిమా సక్సెస్ అంతా అక్కడే వుంది. ఆడపిల్ల అంటే ఆడపిల్ల అనే వాట్సాప్ పంచ్ లు వాడడం వల్ల ట్రయిలర్ క్వాలిటీకి డెంట్ పడింది.
గాల్లో మేడలు కట్టడం కాదు, గృహప్రవేశాలు కూడా చేసేస్తున్నారు అనేది కొత్తగా వుంది. మొత్తం ట్రయిలర్ చూస్తుంటే ఓ మాస్ కమర్షియల్ ప్యాకేజ్ సినిమా ను నితిన్ కోసం రెడీ చేసినట్లు కనిపిస్తోంది.