మహేష్ తో పృధ్వీరాజ్

తెలుగు సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమాలో మలయాళ సూపర్ స్టార్ పృధ్వీరాజ్ నటిస్తే..ఇక ఆ సినిమా రేంజ్ ఏ లెవెల్లో వుంటుంది. ఈ ఫీట్ ను పాజిబుల్ చేయడానికే ప్రయత్నాలు జరుగుతున్నాయి.  Advertisement…

తెలుగు సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమాలో మలయాళ సూపర్ స్టార్ పృధ్వీరాజ్ నటిస్తే..ఇక ఆ సినిమా రేంజ్ ఏ లెవెల్లో వుంటుంది. ఈ ఫీట్ ను పాజిబుల్ చేయడానికే ప్రయత్నాలు జరుగుతున్నాయి. 

కానీ ఒకటే సమస్య. పృధ్వీరాజ్ డేట్ లు. వాటి కోసమే గట్టి ప్రయత్నాలు జరుగుతున్నాయి. విషయం ఏమిటంటే త్రివిక్రమ్ డైరక్షన్ లో మహేష్ బాబు సినిమా చేస్తున్నారు. అది ఈ నెలలో ప్రారంభం కాబోతోంది. ఆ సినిమాలో హీరోతో పాటు, హీరోతో సమానమైన మాంచి క్యారెక్టర్ ఒకటి వుంది. ఆ పాత్ర కోసం మలయాళ సూపర్ స్టార్ పృధ్వీరాజ్ ను తీసుకోవాలని దర్శకుడు త్రివిక్రమ్ భావిస్తున్నారు.

పృధ్వీ రాజ్ కూడా చేయడానికి సిద్దంగానే వున్నట్లు తెలుస్తోంది. కానీ సమస్య ఒకటే. ఇక్కడ మహేష్ సినిమా షెడ్యూలు ప్లానింగ్ తో అక్కడ పృధ్వీ డేట్ లు మాచ్ కావడం లేదు. నిర్మాత, దర్శకుడు, హీరో ఇలా చాలా యాక్టివిటీ వుంది పృధ్వీరాజ్ కు. ఫుల్ బిజీ కూడా. అందుకే ఈ సమస్య. 

అయితే నిర్మాతలు అయిన హారిక హాసిని రెండు భాషల టాప్ హీరోలను ఓ ఫ్రేమ్ లోకి తీసుకురావడం కోసం గట్టిగా ప్రయత్నిస్తోంది. ఆ ప్రయత్నాలు ఫలిస్తాయో లేదో చూడాలి.